ENGLISH

ప్రభాస్‌ 'సాహో'లో జాకీష్రాఫ్‌

19 August 2017-16:34 PM

బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌ 'సాహో' సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. కొద్ది రోజుల్లోనే 'సాహో' షూటింగ్‌కి జాకీ ష్రాఫ్‌ హాజరవుతాడని సమాచారమ్‌. తెలుగులో పలు సినిమాల్లో నటించాడు జాకీ ష్రాఫ్‌. గోపీచంద్‌ హీరోగా నటించిన 'సాహసం'లో నెగెటివ్‌ రోల్‌లో జాకీష్రాఫ్‌ కనిపించి మెప్పించాడు. బాలీవుడ్‌లో ఒకప్పుడు మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరోగా సత్తా చాటాడు. జాకీష్రాఫ్‌, ఊర్మిలా మతోంద్కర్‌, అమీర్‌ఖాన్‌ నటించిన 'రంగీలా' అప్పట్లో ఓ సంచలనం. 'సాహో' సినిమా విషయానికొస్తే ఇందులో ఇప్పటికే బాలీవుడ్‌ తారల హల్‌చల్‌ ఎక్కువైనట్టుంది. హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ని బాలీవుడ్‌ నుంచే తీసుకొచ్చారు. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, చుంకీ పాండే కూడా బాలీవుడ్‌ నటులే. వీరిద్దరూ నెగెటివ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. లేటెస్టుగా జాకీష్రాఫ్‌ ఎంట్రీ. ఇంకా ఎంతమంది బాలీవుడ్‌ కాస్టింగ్‌ యాడ్‌ అవుతుందో తెలీదు కానీ, కాస్టింగ్‌ చూస్తేనే అర్ధమవుతోంది ఈ సినిమా రేంజ్‌ ఏంటో. ఇప్పటికే యాక్షన్‌ సీన్స్‌ కోసం హాలీవుడ్‌ నుండి నిపుణులను దిగుమతి చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'బాహుబలి' సినిమాతో ప్రబాస్‌కి వచ్చిన స్టార్‌డమ్‌ కారణంగానే ఈ సినిమాకి ఇంత హైప్‌ క్రియేట్‌ అవుతోంది. తాజాగా ప్రబాస్‌ సెట్స్‌లోకి అడుగు పెట్టాడు. భారీ బడ్జెట్‌ యాక్షన్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ALSO READ: సెట్స్‌ మీదికి వెళ్లనున్న కేసీఆర్‌ సినిమా