ENGLISH

గ్లామ్‌ షాట్‌: కలర్‌ ఫుల్‌ 'బ్యూటీ' ఫుల్‌

17 June 2017-18:21 PM

బాలీవుడ్‌లో 'జుద్వా 2' సినిమా కోసం ముద్దుగుమ్మ జాక్వెలైన్‌, మరో ముద్దుగుమ్మ తాప్సీల మధ్య వార్‌ నడుస్తుందంటూ గాసిప్స్‌ వస్తున్నాయి. ఆ సినిమా ప్రొడ్యూసర్‌ సాజిత్‌ నడియడ్‌వాలా కారణంగానే ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య వార్‌ నడుస్తోందంటూ మరో పక్క రూమర్‌ నడుస్తోంది. ఈ గొడవ విషయం పక్కన పెడితే, తన అందచందాలతో బాలీవుడ్‌ స్క్రీన్‌పై స్టార్‌డమ్‌ సంపాదించుకున్న ముద్దుగుమ్మ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. కలర్‌ ఫుల్‌ డ్రస్సులో హాయిగా నవ్వులు చిందిస్తూ వయ్యారంగా ఇలా ఫోటోకి పోజిచ్చింది. ఆమె అందానికి కుర్రకారు జివ్వు జవ్వుమని అమ్మడిపై మనసు పారేసుకుంటున్నారు. ఈ వయ్యారి భామ అందాలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. 'జుద్వా 2'తో పాటు 'డ్రైవ్‌' సినిమాలోనూ నటిస్తోంది.

ALSO READ: Qlik Here For More Pics << Jacqueline Fernandez