ENGLISH

'రంగస్థలం'లో సమంత పాదాలు

17 June 2017-18:19 PM


చుట్టూ కొండలు, గుట్టలు, కొబ్బరి చెట్ల నడుమ అలరించే గోదావరి అందాలు ఇది అందరికీ తెలిసిందే. కోనసీమ అందాలివి. ఈ అందాల్ని ఓ అందమైన పాదాలు డామినేట్‌ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి చూద్దాం. అదేంటి? ఈ అందాలన్నీ ఎక్కడ? ఆఫ్ట్రాల్‌ పాదాలెక్కడ? వాటిని ఇవి డామినేట్‌ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అవునండీ క్రియేటివిటీ ఉండాలి కానీ, స్వర్గాన్ని కూడా డామినేట్‌ చేసెయొచ్చు. కానీ గ్రాఫిక్స్‌లో మాత్రమే. అయితే ఇక్కడ ఏ గ్రాఫిక్స్‌ లేవండీ. ఇదంతా కెమెరామేన్‌ టాలెంట్‌ అనుకోవాలా? లేక ఫోటో దిగిన అమ్మాయి టాలెంట్‌ అనుకోవాలా? అంటే ఖచ్చితంగా ఫోటో దిగిన అమ్మాయి టాలెంటే అనుకోవాలి. ఇంతకీ గోదావరి అందాల్ని డామినేట్‌ చేసిన అమ్మాయి సమంత అని తెలిసిపోయింది. ఎందుకంటే సమంత గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంటోన్న 'రంగస్థలం' సినిమా షూటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పరిసర ప్రాంతాల్ని సమంత ఎంత ఆహ్లాదంగా ఫీలవుతోందో ఈ ఫోటో చూస్తేనే తెలుస్తుంది. గోదావరి ఒడ్డున తన పాదాలు మాత్రమే పడేలా ఓ ఫోటోకి పోజిచ్చింది సమంత. ఈ ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోకి ఎన్ని లైక్స్‌ వచ్చేస్తున్నాయో చెప్పడం కన్నా చూస్తేనే బెటర్‌. అసలే సమంతకి క్రియేటివిటీ ఎక్కువ. ఆ క్రియేటివిటీ ఇప్పుడు మరింత ఎక్కువయిపోయిందనే చెప్పాలి. అందమైన తన పాదాలకు అంతకన్నా అందమైన పట్టీలు కూడా వేసుకుంది. ఆ ఫోటో చూస్తే తన అందమైన పాదాలతో సమంత గోదావరి అందాలను డామినేట్‌ చేస్తుందో లేదో మీరే చెబుతారులే!

 

ALSO READ: బోయపాటి-నాగ చైతన్య సినిమా పైలేటెస్ట్ అప్డేట్