ENGLISH

మెగా ప్రిన్స్‌ కొత్త కొత్తగా

17 June 2017-18:06 PM

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా ప్రారంభమైంది. అట్లూరి వెంకీ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అట్లూరి వెంకీ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలి సినిమా అయినా వరుణ్‌ని ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించబోతున్నాడట డైరెక్టర్‌ వెంకీ. ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా ముద్దుగుమ్మ రాశీఖన్నా నటిస్తోంది. వరుణ్‌ తేజ్‌ - రాశీ ఖన్నా జంట కొత్తగా ఆకట్టుకోనుందంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. వరుణ్‌ తేజ్‌ న్యూ గెటప్‌తో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడట ఈ సినిమాలో. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఇటీవలే 'మిస్టర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వరుణ్‌ తేజ్‌. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. త్వరలోనే 'ఫిదా'తో రానున్నాడు. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో 'ఫిదా' తెరకెక్కుతోంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదో డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ. లవ్‌ స్టోరీస్‌ని మనసుకు హత్తుకునే కోణంలో సింపుల్‌గా తెరకెక్కించడంలో శేఖర్‌ కమ్ముల దిట్ట. అలాగే ఈ సినిమాపై అంచనాలున్నాయి. ఇది కూడా ఓ పీల్‌ గుడ్‌ మూవీ కానుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే వరుణ్‌ మరో సినిమాని పట్టాలెక్కించేశాడు. వరుణ్‌ రూటు మార్చాడు. ఇకపై వరుసగా సినిమాలు చేస్తానంటున్నాడు. 'ఫిదా' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.