'నా గెలుపు ఎప్పుడో మొదలైంది..' అంటూ నాని ట్రైలర్‌లో చెబుతున్న డైలాగే ఈ సినిమా విజయానికి సూచికగా కనిపిస్తోంది. సినిమా హిట్ గురించి నానినే ముందుగా తేల్చేశాడు. ఇక ప్రేక్షకులు డిసైడ్ చేసేదే మిగిలుంది. అందుకు కొంచెమే టైం మిగిలి ఉది. ఇంతకీ ఇదంతా ఏ సినిమా కోసం అనుకుంటున్నారా? నాని హీరోగా తెరకెక్కుతోన్న 'నిన్ను కోరి' గురించి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. నాని సినిమాలంటేనే జనం ఇప్పటికే ఓ ఐడియాకొచ్చేశారు. ఇక ట్రైలర్స్ వచ్చాక ఆ అంచనాలు అంతకుమించి పెరిగిపోవడం మామూలే. నాని తాజా సినిమా విషయంలోనూ అదే జరిగింది. 'నిన్ను కోరి' ట్రైలర్ సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ట్రైలర్ కట్ చేసిన విధానం, నాని చెప్పే డైలాగులు అన్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అందుకే నాని అంత నమ్మకంగా గెలుపు స్టార్ట్ అయిపోయింది అంటూ ట్రైలర్ చివర్లోనూ డైలాగ్ చెప్పేశాడు. ఆడియన్స్ కూడా అలా డిసైడ్ అయిపోవడం ఖాయమే అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. 'జెంటిల్‌మెన్' సినిమాలోనానితో జత కట్టిన కేరళ కుట్టి నివేదా థామస్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ హీరో ఆది పినిశెట్టి ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో కన్పిస్తున్నాడు. జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ: బోయపాటి-నాగ చైతన్య సినిమా పైలేటెస్ట్ అప్డేట్