ENGLISH

అక్కడ 10 కోట్ల క్లబ్‌లో 'జై లవకుశ'

01 October 2017-08:34 AM

ఈ నెల 21న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న సినిమా 'జై లవకుశ'. ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంలో తెరకెక్కిన సినిమా ఇది. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌కి కాసుల పంట పండిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 'జై లవకుశ' జోరు ఇంకా తగ్గలేదు. ఓవర్సీస్‌లో 'జై లవకుశ' సాధించిన వసూళ్లు 1,467,800 డాలర్లు అంటే అక్షరాలా 9.59 కోట్లు. ఇది నిన్నటి లెక్క. ఈ రోజుతో 10 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయినట్లే. ఆల్రెడీ గ్రాస్‌ 100 కోట్ల క్లబ్‌లో ఆడుగు పెట్టేశాడు ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ నటనకు అంతా ఫిదా అయిపోతున్నారు. మూడు గెటప్స్‌లోనూ ఎన్టీఆర్‌ ఇరగదీసేశాడు. వాటిలో 'జై' పాత్ర ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకుంది. పబ్లిసిటీలోనూ జై పాత్రనే ఎక్కువ ఎలివేట్‌ చేస్తున్నారు. ఈ పాత్ర నిజానికి నెగిటివ్‌ షేడ్స్‌తో ఉన్నప్పటికీ, కామెడీతో పాటు, ఎమోషనల్‌ సీన్స్‌నీ పండించింది. అందుకే ఈ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్‌ని చూడడం ఆడియన్స్‌కి కొంచెం కొత్తగా అనిపించింది. అలాగే భిన్న యాంగిల్స్‌ ఉన్న ఆ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్‌ అద్భుత నటనకు జనం పట్టం కట్టేశారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. కళ్యాణ్‌రామ్‌ నిర్మాణంలో తొలిసారిగా ఎన్టీఆర్‌ నటించిన సినిమా కావడంతో హైలీ ఎక్స్‌పెక్టేషన్స్‌ నమోదయ్యాయి. వసూళ్ల లెక్కలు చూస్తుంటే, అంచనాల్ని ఎన్టీఆర్‌ అందుకున్నట్లే అనిపిస్తోంది. మొదట్లో వచ్చిన టాక్‌తో చిత్ర యూనిట్‌ కొంచెం నిరాశ చెందినప్పటికీ, ఎన్టీఆర్‌కున్న ఇమేజ్‌తో వసూళ్ల లెక్కల బట్టి చూస్తే ఎన్టీఆర్‌ సక్సెస్‌ని కంటిన్యూ చేసినట్లే అనుకోవాలి. హీరోయిన్లుగా రాశీ ఖన్నా, నివేదా థామస్‌కి 'జై లవకుశ' ఓ మంచి సినిమా అని చెప్పొచ్చు.

ALSO READ: ఎన్టీఆర్ ని అభినందించిన రామ్ చరణ్