ENGLISH

'జై లవ కుశ' ప్రీ రిలీజ్‌ టాక్‌ కెవ్వు కేక

16 September 2017-21:31 PM

యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ నటించిన 'జై లవకుశ' ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. సెప్టెంబర్‌ 21న ఈ సినిమా ప్రేక్షకుల్ని పలకరించనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని ఎన్టీయార్‌ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించారు. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీయార్‌ త్రిపాత్రాభినయం చేసిన సంగతి తెలిసినదే. ఏ సినిమాకి అయినా ప్రీ రిలీజ్‌ టాక్‌, ఆ సినిమాకి అదనపు ఉత్సాహాన్నిస్తుంది. ఓపెనింగ్స్‌ అదిరిపోయే రేంజ్‌లో రావడానికి ఈ టాక్‌ ఉపయోగపడ్తుంది. 'జై లవకుశ' ఫస్ట్‌ టైటిల్‌ టీజర్‌ రాకతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. 'జై' పాత్ర తాలూకు టీజర్‌ వచ్చాక, ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రోమో సినిమాపై అంచనాల్ని పెంచుకుంటూనే పోయింది. సినిమా విడుదలకు ముందు, ఈ సినిమాకి టాక్‌ అద్భుతంగా వచ్చేస్తోంది. ఫస్టాఫ్‌ అదిరిపోయిందనీ, సెకెండాఫ్‌లో 'జై' పాత్ర సహా మిగిలిన పాత్రలు తెరపై చెలరేగిపోవడంతో సినిమా అద్భుతః అన్పించేసిందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ నుంచి టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. సినిమాని సెన్సార్‌ చేసిన టీమ్‌ కూడా నిర్మాతకి అభినందనలు తెలిపారనే వార్తలు ఇంతకు ముందే వచ్చాయి. ఇప్పుడీ ప్రీ రిలీజ్‌ టాక్‌ సూపర్బ్‌గా ఉండటంతో ఎన్టీయార్‌ అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారిపోయింది. తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన ఎన్టీయార్‌ మూడు పాత్రల్లో నట విశ్వరూపం చూపేశాడనే టాక్‌ నిజమైతే 'జై లవకుశ' రికార్డులు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోగలమా?

ALSO READ: తేజ డైరెక్షన్‌లో బాలయ్య పొలిటికల్‌ మూవీ?