ENGLISH

ఆర్‌.ఆర్‌.ఆర్ కు అడ్డుత‌గులుతున్న ప‌వ‌ర్ స్టార్‌

27 January 2022-14:02 PM

తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అయితే, క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌. ఇటీవ‌ల పునీత్ మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆ విషాదం నుంచి క‌న్నడ చిత్ర‌సీమ ఇంకా కోలుకోలేదు. మార్చి 17... పునీత్ జ‌న్మ‌దినం. ఈ సంద‌ర్భంగా పునీత్ న‌టించిన‌ చివ‌రి చిత్రం `జేమ్స్‌`ని విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించారు. పునీత్ పుట్టిన రోజున‌.. పునీత్ చివ‌రి సినిమా విడుద‌ల కావ‌డం.. ఓ భావోద్వేగ భ‌రిత సంగ‌తి. అందుకే క‌న్న‌డ చిత్ర‌సీమ‌.. మార్చి 17 నుంచి ఓ వారం వ‌రకూ మ‌రో సినిమా ఏదీ విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంది. ఇది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`ని ఇబ్బందిపెట్టే విష‌యం.

 

ఎందుకంటే మార్చి 18న `ఆర్‌.ఆర్‌.ఆర్‌`ని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాకి క‌న్న‌డ‌లోనూ మంచి మార్కెట్ ఉంది. `జేమ్స్‌` విడుద‌లైతే.. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`కి కన్న‌డ సీమ‌లో చోటు ద‌క్క‌దు. కాబ‌ట్టి మ‌రో రిలీజ్ డేట్ చూసుకోవాల్సిందే. ఆర్‌.ఆర్‌.ఆర్ ని మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.కాబ‌ట్టి.. ఏప్రిల్ 28నే విడుద‌ల చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ALSO READ: పూరి - విజ‌య్‌.. రిపీటే...!