ENGLISH

ఆర్‌.ఆర్‌.ఆర్ కోసం చ‌ర‌ణ్ భ‌లే ట్రిక్కు..!

27 January 2022-15:08 PM

ఎక్కడ‌కు వెళ్లినా, సొంత సినిమా ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం కొంత‌మందికే సాధ్యం. మ‌రీ ముఖ్యంగా ఇలాంటి విష‌యాల్లో రాజ‌మౌళి చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. ఇప్పుడు ఆ ల‌క్ష‌ణం రామ్ చ‌ర‌ణ్‌కీ వ‌చ్చేసింది. చ‌ర‌ణ్ ఎక్క‌డ‌కు వెళ్లినా `ఆర్‌.ఆర్‌.ఆర్‌` ప‌బ్లిసిటీ ఫ్రీగా జ‌రిగిపోతోంది. గుడ్ లక్ స‌ఖీ ప్రీ రిలీజ్‌లోనూ ఇంతే.

 

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్ర‌మిది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా వెళ్లాడు. అక్క‌డ‌... కీర్తి సురేష్‌తో ఓ స్టెప్పు వేశాడు. సాధార‌ణంగా.. హీరోలు, హీరోయిన్లు ఎక్క‌డికి వెళ్లినా, స్టేజీపై స్టెప్పులేయ‌డం స‌హ‌జ‌మే. కాక‌పోతే.. ఏ సినిమాకి ప్ర‌మోట్ చేస్తున్నారో ఆ సినిమాకి. కానీ కీర్తి సురేష్ తో చ‌ర‌ణ్ స్టెప్పులేసింది `గుడ్ ల‌క్ స‌ఖీ` పాట‌కు కాదు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` పాట‌కు. `మీతో స్టెప్పు వేయాల‌ని వుంది` అని కీర్తి అడ‌గ్గానే చ‌ర‌ణ్ ఒప్పుకుని స్టెప్ వేశాడు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`లోని `నాటు నాటు నాటు` స్టెప్పు కోసం. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అలా చ‌ర‌ణ్‌...`గుడ్ ల‌క్ స‌ఖీ` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో త‌న సినిమాకి కావ‌ల్సినంత ప్ర‌మోష‌న్ ఇచ్చుకున్నాడు.

ALSO READ: పూరి - విజ‌య్‌.. రిపీటే...!