ENGLISH

స‌మంత ఒత్తిడి మేర‌కే... నాగ్ ట్వీట్‌?

28 January 2022-10:36 AM

నాగ‌చైత‌న్య - స‌మంతల విడాకుల మేట‌ర్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. `స‌మంత కోరిక మేర‌కే నాగ‌చైత‌న్య విడాకులు ఇచ్చాడు` అంటూ నాగ్ చెప్పిన‌ట్టుగా ఓ వార్త ఇండ‌స్ట్రీ అంతా చ‌క్క‌ర్లు కొట్టింది. దాంతో ఈ విడాకుల‌కు స‌మంతే కార‌ణం... అనే సంకేతాలు అందిన‌ట్టైంది. దీనిపై సోష‌ల్ మీడియా అంతా ర‌చ్చ ర‌చ్చ జ‌రిగింది. చైతూ ఫ్యాన్స్‌, స‌మంత ఫ్యాన్స్ రెండుగా విడిపోయి.. `కార‌ణం మీరంటే.. మీరంటు` ట్రోల్ చేసుకున్నారు. జ‌రుగుతున్న త‌తంగం అంతా గ‌మ‌నించిన నాగ్.. ఓ ట్వీట్ చేసి, ఈ రాద్ధాంతానికి తెర దించారు.

 

`నేను అలా అన‌లేదు. ఆ వార్త‌ల్లో నిజం లేదు. పుకార్లు వార్త‌లుగా రాయొద్దు` అంటూ ఓ ట్వీట్ తో .. నాగ్ ఈ గొడ‌వ‌కు పుల్ స్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఇప్పుడు మ‌రో వాద‌న వినిపిస్తోంది. స‌మంత ఒత్తిడి మేరే... నాగ్ ఈ ట్వీట్ చేశార‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న రాద్ధాంతాన్ని స‌మంత నాగ్ దృష్టికి తీసుకెళ్లింద‌ని, త‌న పేరు మ‌స‌క బారుతోంద‌న్న ఆవేద‌న‌ని స‌మంత వ్య‌క్తం చేసింద‌ని, దాంతో నాగార్జున ఓ ట్వీట్ తో వ్య‌వ‌హారం మొత్తం చ‌క్క‌బెట్టార‌ని తెలుస్తోంది. మొత్తానికి నాగ్ ట్వీట్ తో స‌మంత‌, చై అభిమానుల మ‌ధ్య గొడ‌వ‌ని తెర‌దించిన‌ట్టైంది.

ALSO READ: ఆర్‌.ఆర్‌.ఆర్ కోసం చ‌ర‌ణ్ భ‌లే ట్రిక్కు..!