ENGLISH

హాస్పిటల్ లో చేరిన జాన్వీ కపూర్

18 July 2024-19:20 PM

జాన్వీ కపూర్ ఆస్పత్రి పాలయ్యారు. ఫుడ్ పాయిజినింగ్ ఇందుకు కారణం. ఆమె తీసుకున్న ఆహరం కల్తి కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జాన్వీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉన్నట్లు  తండ్రి బోనీ కపూర్‌ వెల్లడించారు. రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’లో హీరోయిన్ గా నటిస్తోంది జాన్వీ. తెలుగు ఇది ఆమెకు మొదటి సినిమా. ఈ సినిమా సెట్స్ పై వుండగానే రామ్‌ చరణ్‌ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రానికి సైన్ చేసింది జాన్వి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమౌతుంది.