ENGLISH

జాన్వీ పెళ్లి తరవాత సౌత్ లో సెటిల్ అవుతుందా?

23 January 2025-10:59 AM

అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో సెటిల్ అవుతోంది. కెరియర్ స్టార్ట్ చేసి చాలా కాలం అయినా సరైన హిట్ పడలేదు. జాన్వీ నటించిన సినిమాలు ఎక్కువ శాతం ఓటీటీ లోనే రిలీజ్ అయ్యాయి. థియేటర్స్ లో రిలీజ్ అయినవి నిరాశపరిచాయి. దేవర మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి బిగెస్ట్ హిట్ అందుకుంది. దేవర 2 లో జాన్వీ పాత్రకి ఎక్కువ స్కోప్ ఉందని తెలుస్తోంది. నెక్స్ట్ రామ్ చరణ్ - బుచ్చి బాబు కాంబో మూవీ RC16 లో కూడా నటిస్తోంది. జాన్వీకి తల్లి శ్రీదేవి అంటే చాలా ఇష్టం, ప్రేమ, భక్తి. తల్లి బతికున్నప్పుడు చెప్పిన కొన్ని మాటలను ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తుంది జాన్వీ.

శ్రీదేవికి సౌత్ అంటే చాలా ఇష్టం. సౌత్ ప్రేక్షకులు, ఇక్కడ ప్లేస్ లు అంటే చాలా ఇంట్రస్ట్. ముఖ్యంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా ఇష్టం. దీంతో జాన్వీ కూడా సౌత్ పై ఇంట్రస్ట్ పెంచుకుంది. తరచుగా తిరుమలకి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటుంది. పక్కాగా ట్రెడిషనల్ వేర్ లో స్వామి దర్శనానికి వెళ్తుంది. తల్లికి ఇష్టమైన తిరుపతి పై జాన్వీ ఎంతలా ఇష్టం పెంచుకుంది అంటే తన పెళ్లి తరవాత తిరుపతిలో సెటిల్ అవ్వాలనేంతగా.

తాజాగా కరణ్ జోహార్ తో ఒక షోలో పాల్గొన్న జాన్వీ తన మ్యారేజ్ డ్రీమ్ గురించి చెప్పింది. పెళ్లి తరవాత లైఫ్ గూర్చి హోస్ట్ అడగ్గా జాన్వీ రిప్లై ఇస్తూ ఆఫ్టర్ మ్యారేజ్ తిరుమల తిరుపతిలో సెటిల్ అవ్వాలని ఉందని, ముగ్గురు పిల్లలు ఉండాలని, ప్రతి రోజు అరటి ఆకుల్లో తినాలని, నిత్యం గోవింద నామస్మరణ వింటూ తరించాలని, మణిరత్నం సాంగ్స్ వినాలి, తన భర్త సౌత్ స్టైల్ లో లుంగీ కట్టుకుని తిరగాలని, అది తన రొమాంటిక్ డ్రీమ్ అని తెలిపింది. బాలీవుడ్ లాంటి ఫాస్ట్ కల్చర్ లో పెరిగిన జాన్వీ ఇలా సౌత్ కలలు కంటోంది అని అంతా ఆశ్చర్య పోతున్నారు.