ENGLISH

వర్మ రూటే వేరు.... టైటిల్, స్టోరీ రెండిటితో మూవీ అనౌన్స్ మెంట్

23 January 2025-13:34 PM

రామ్ గోపాల్ వర్మ పేరులోనే ఉంది క్రేజ్. ఒకప్పుడు డిఫరెంట్ మేకింగ్ తో బాలీవుడ్ ని కూడా మెప్పించిన ఆర్జీవీ ఇప్పుడు తెలుగులో కూడా హిట్ కొట్టలేకపోతున్నాడు. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మతో వర్క్ చేయటానికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టేవారు. ఇప్పడు చిన్న హీరో కూడా వర్మని నమ్మే పరిస్థితి లేదు. నా ఇష్టం అన్న రీతిలో తనకి నచ్చినట్టుగా సినిమాలు తీసుకుని ఫెయిల్యూర్ బాట పట్టాడు. కేవలం అమ్మాయిల్ని మెయిన్ లీడ్ గా పెట్టుకుని బీగ్రేడ్ సినిమాలు తీసుకుంటూ కాలం గడుపుతున్నాడు. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు వర్మకి 'సత్య' రీరిలీజ్ రియలైజేషన్ ఇచ్చింది.

ప్రజంట్ రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుండటంతో వర్మ డైరక్ట్ చేసిన సత్య మూవీ రీరిలీజ్ చేసారు. ముంబైలో వేసిన స్పెషల్ షోకి ఆర్జీవీతో పాటు సత్య మూవీ యాక్టర్స్, టెక్నీషీయన్స్ అంతా వెళ్లారు. సత్య మూవీ చూసిన తరవాత వర్మ నిజాయితీగా తాను చేసిన తప్పుల్ని ఒప్పుకుని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. అప్పుడున్న నిజాయితీ, నిబద్దత ఇప్పుడు తనలో లేవని, అహంకారంతో చెత్త సినిమాలు తీసానని ఒప్పుకుని ఇకపై మంచి సినిమాలు తీస్తానని నిజాయితిగా ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చాడు. ఆర్జీవీ లాంటి మోనార్క్ ఇలా ఓపెన్ గా తన తప్పుని ఒప్పుకోవటం, రియలైజ్ అవటంతో వర్మ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

అన్న మాట ప్రకారం వర్మ తన కొత్త సినిమా టైటిల్, కథ గూర్చి చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. సినిమా టైటిల్ 'సిండికేట్' అని భారతదేశ అస్తిత్వానికే ముప్పు కలిగించే ఓ భయంకరమైన సంస్థ ఈ సిండికేట్ అని తెలిపాడు. అవినీతి రంగాలు, సంస్థలు అన్నీ కలిసి ఆర్ధిక సంస్కరణలు నాశనం చేసాయి. నెక్స్ట్ టెర్రరిజం కూడా మొదలైంది. ఈ మధ్య భారతదేశంలో పేరున్న నేర సంస్థ ఏదీ లేదు. ప్రపంచ దేశాలు మధ్య ఉన్న వైరం, జరుగుతున్న యుద్ధాలు కారణంగా ఒక కొత్త నేర సంస్థ పుడుతుంది అని, గత సంస్థలకు భిన్నంగా పోలీసింగ్ ఏజెన్సీలు, రాజకీయాలు, రిచ్ బిజినెస్ మెన్స్, మిలిటరీ అన్ని కలిసి ఒక సిండికేట్‌గా మారి, బలమైన శక్తిలా ఎదగటమే తన సినిమా కథ అని పేర్కొన్నాడు వర్మ. 'ఒక మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు' అనే ప్రకటనతోనే సిండికేట్ మూవీ స్టార్ట్ అవుతుందని, దీని లక్ష్యం భారతదేశాన్ని ఒక కొత్త భారతదేశంతో రీప్లేస్ చేయడమే అని తెలిపాడు.

ALSO READ: జాన్వీ పెళ్లి తరవాత సౌత్ లో సెటిల్ అవుతుందా?