ENGLISH

యంగ్‌ టైగర్‌ క్లిక్‌: తమ్ముడితో అభయ్‌రామ్‌

18 June 2018-15:59 PM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇటీవలే రెండోసారి తండ్రయ్యాడు. ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి రెండో కాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యంగ్‌ టైగర్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ అంటే ఎన్టీఆర్‌కి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. కొడుకు ఫోటోల్ని చూసి మురిసిపోవడమే కాదు, ఎప్పటికప్పుడే వాటిని అభిమానులతో పంచుకుంటుంటాడు.

 

అభయ్‌ వచ్చాక తన లైఫ్‌ స్టైలే మారిపోయిందంటాడు ఎన్టీఆర్‌. అంతలా యంగ్‌ టైగర్‌ని అభయ్‌ రామ్‌ మార్చేశాడు. మరి ఇంకో బుడ్డోడు వచ్చేశాడు. ఎన్టీఆర్‌ ఆనందం రెట్టింపైంది. అభయ్‌ సంగతేంటి? తమ్మున్ని చూసి అభయ్‌ ఇలా మురిసిపోతున్నాడు.. అని సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ ఈ ఫోటోని పోస్ట్‌ చేశాడు. బుడ్డోడ్ని చూసి అభయ్‌ మురిసిపోతుంటే, బుడ్డోడ్ని, అభయ్‌నీ కెమెరాలో బంధించేందుకు ఎన్టీఆర్‌ ప్రయత్నిస్తున్నాడు. ఈ మొత్తం ప్రయత్నాన్ని లక్ష్మీ ప్రణతి తన కెమెరాలో బంధించింది. 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ 1 (అభయ్‌రామ్‌), యంగ్‌ టైగర్‌ జూనియర్‌ 2 (ఇంకా పేరు పెట్టలేదు) ఫోటోలో ఇలా కనిపించి అభిమానులకు బోలెడంత సందడి తెచ్చేశారు. ఇదీ ఫోటో వెనక కథ.

ALSO READ: మహేష్ 25వ చిత్రం ఆగిపోనుందా?