ENGLISH

పేషెంట్‌లా మారిన కొత్త సినిమా

26 September 2017-11:51 AM

కొత్త సినిమాని ఎన్టీఆర్‌ ఎమర్జెన్సీ పేషెంట్‌తో పోల్చాడు. చాలా మందికి ఈ పోలిక నచ్చలేదు. కానీ ఇది ఎన్టీఆర్‌ ఆవేదన. 'జై లవకుశ' సినిమా టీజర్‌ ముందుగానే లీకైపోయింది. ఇండియాలో సినిమా రిలీజ్‌ కాకముందే విదేశాల నుండి లీకేజీలు ఈ సినిమాని బాధించాయి. విదేశాల్లో ముందుగా సినిమా రిలీజ్‌ కావడం వల్ల బిట్స్‌ బిట్స్‌గా సినిమా వీడియోలను తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసేశారు. ఈ సంఘటనలు ఎవరినైనా బాధిస్తాయి నిజమే. అయితే ఎన్టీఆర్‌ మాత్రం సినీ విశ్లేషకుల్ని టార్గెట్‌ చేశారు. రివ్యూలు కరెక్ట్‌గా రాయకపోవడం వల్లనే సినిమాకి భిన్న టాక్‌ వినిపిస్తోందనే ఎన్టీఆర్‌ అభిప్రాయమనీ తెలుస్తోంది ఈ మాటల ద్వారా. కానీ సినిమాకి విశ్లేషకుల నుండి కలిగే ప్రమాదం చాలా తక్కువ. సోషల్‌ మీడియా ఇంత యాక్టివ్‌ అయిపోయాక ఎవర్నీ ఆపలేకపోతున్నాం. దేనికీ అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. విత్‌ ఇన్‌ సెకన్స్‌లో ప్రపంచం చుట్టేస్తోంది లీకేజీ మహమ్మారి. అందుకే ముందుగా పైరసీని మట్టుపెట్టాలి. సోషల్‌ మీడియాపై ఓ కన్నేసి ఉంచాలి. ఇవేమీ జరగనంత వరకూ జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంటుంది. కానీ ఇది జరగడం కూడా అంత తేలికగా సాధ్యమయ్యే పని కూడా కాదు. ఏది ఏమైనా ఎన్టీఆర్‌ ఆవేదన కరెక్టే. పైరసీ భూతానికి ఎంతగా ఆడ్డుకట్ట వేసినా దాన్ని పారద్రోలడం సాధ్యం కావడం లేదు. రిలీజ్‌కి ముందే ఈ పైరసీ భూతంతో తేరుకోలేని నష్టం జరిగిపోతోంది. అదృష్టం కొద్దీ సక్సెస్‌ అందితేనే సినిమాకి ఆక్సిజన్‌ అందినట్లవుతోంది.

ALSO READ: మహేష్ స్పైడర్ ప్రీ-రిలీజ్ టాక్