ENGLISH

ఎన్టీఆర్‌ అప్పుడలా.. ఇప్పుడెలాగో.?

15 June 2018-19:45 PM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న తాజా చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ' ఈ ఏడాది దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుందన్న సంగతి తెలిసిందే. అరదుకే చిత్ర యూనిట్‌ విరామం లేకుండా, షూటింగ్‌ చకచకా కానిచ్చేస్తోంది. ఆల్రెడీ హీరోయిన్‌ పూజా హెగ్దే పాత్ర చిత్రీకరణ ఎప్పుడో పూర్తయిపోయింది. ఇక మిగిలిన షూటింగ్‌ త్వరలోనే పూర్తి కానుందట. 

ఇకపోతే, గతేడాది దసరాకి విడుదలైన 'జై లవకుశ' చిత్రం ఎన్టీఆర్‌కి ఫర్వాలేదనిపించింది. కానీ ఈ సారి అలా కాదు, ఎలాగైనా 'అరవింద సమేత..'తో హిట్‌ కొట్టాలనుకుంటున్నాడు. ఇదసలే ప్రెస్టీజియస్‌ ఇష్యూ. ఎందుకంటే ఈ చిత్రాన్ని తెరకెక్కించేది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌. 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్‌ కారణంగా త్రివిక్రమ్‌ చాలా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకానొక సమయంలో త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌ సినిమా వద్దనుకుంటున్నాడనే ప్రచారం కూడా జరిగింది. కానీ పట్టు వదలకుండా ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించారు. 

సో ఇటు ఎన్టీఆర్‌కీ, అటు త్రివిక్రమ్‌కీ ఈ సినిమా సక్సెస్‌ అత్యంత కీలకంగా మారింది. సినిమాలకు దసరా విడుదల బాగా కలిసొచ్చే అంశం. ఎక్కువ సెలవులు కలిసి రావడంతో, ఏమాత్రం పోజిటివ్‌ టాక్‌ వచ్చినా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురుస్తుంది. అందుకే ఈ సినిమాని ఏది ఏమైనా దసరాకే విడుదల చేయాలని గట్టి పట్టు మీదున్నారట. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌. అది కూడా అక్టోబర్‌ 10న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. 

అయితే ఈ డేట్‌పై ఇంకా అఫీషియల్‌ క్లారిటీ రావాల్సి ఉంది.
 

ALSO READ: సమ్మోహనం మూవీ రివ్యూ & రేటింగ్