ENGLISH

రూమ‌ర్లు ఆపాలంటున్న కైకాల కుటుంబ స‌భ్యులు

23 November 2021-18:00 PM

న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో ఉన్నారు. ఆయ‌న ప‌రిస్థితి క్లిష్టంగా ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే.. ఈలోపే కొంత‌మంది తొంద‌ర‌ప‌డుతున్నారు. కైకాల స‌త్య‌నారాయ‌ణ చ‌నిపోయారంటూ రూమ‌ర్లు వ్యాప్తి చేస్తున్నారు. ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌ల‌లో కైకాల చ‌నిపోయార‌న్న వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. కొంత‌మంది సెల‌బ్రెటీలు సైతం... కైకాల‌కు సంతాపాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఆయ‌న క్షేమంగానే ఉన్నార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. త‌న తండ్రి కోలుకుంటున్నార‌ని, ద‌య‌చేసి రూమ‌ర్లు వ్యాప్తి చేయొద్ద‌ని కైకాల కుమార్తె ర‌మాదేవి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఈ మేర‌కు ఆమె ఓ ఆడియో బైట్ విడుద‌ల చేసింది.

 

`నాన్న‌గారి పరిస్థితి బాగానే ఉంది. ఆయన కోలుకుంటున్నారు. ఆయన బాగా స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. నిన్న డాక్టర్ మాదాల రవిగారొచ్చారు. ఆయనతో కూడా మాట్లాడి థమ్స్ అప్ కూడా చూపించారు. సో.. ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు. దయచేసి టీవీలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాన్ని ఆందోళనకు గురి చేయొద్దు. ఆయన పరిస్థితి బాగానే ఉంది. బాగా కోలుకుంటున్నారు’ అని రమాదేవి చెప్పారు.

ALSO READ: బంగార్రాజు టీజర్ టాక్ : నవ మన్మధుడు అదిరిపోయాడు