ENGLISH

కైకాల స‌త్య‌నారాయ‌ణ‌: హెల్త్ అప్ డేట్‌

20 November 2021-13:37 PM

ప్ర‌ముఖ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆసుప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు ఉద‌యం ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌వ్వ‌డంతో కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్ లోని అపోలో ఆసుప‌త్రిలో చేర్పించారు. కొన్ని రోజుల క్రితం ఆయ‌న ఇంట్లో కాలు జారి ప‌డ్డారు. దాంతో ఆయ‌న్ని ఆసుప‌త్రిలో చేర్చారు. కొన్ని రోజులు చికిత్స పొందిన త‌ర‌వాత ఆయ‌న డిశ్చార్జ్ అయ్యారు. అంతా బాగానే ఉంద‌నుకుంటున్న త‌రుణంలో ఆయ‌న ఆరోగ్యం మ‌ళ్లీ క్షీణించింది.

 

''కైకాల స‌త్య‌నారాణ‌య‌ని ప్ర‌స్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆయ‌న ఆరోగ్యం కొంత క్లిష్టంగా ఉన్న మాట నిజ‌మే. వ‌య‌సు రీత్యా వ‌చ్చే ఇబ్బందుల వ‌ల్ల ఆయ‌న స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కొన్ని రోజులు ఆయన్ని ఆజ్బ‌ర్వేష‌న్‌లో ఉంచాల‌ని వైద్యులు తెలిపారు'' అని కైకాల కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రు మీడియాకు తెలిపారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాల‌ని అభిమానుల‌తో పాటు చిత్ర‌సీమ కోరుకుంటోంది. గెట్ వెల్ సూన్ సార్‌..!

ALSO READ: అఖండ సెన్సార్ డిటైల్స్ ఇవే!