ENGLISH

సెగ‌లు పుట్టించ‌బోతున్న చంద‌మామ‌.

23 September 2020-11:00 AM

తెర‌పై ఎప్పుడూ సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన పాత్ర‌ల్లోనే క‌నిపించింది కాజ‌ల్. హ‌ద్దుల్లో ఉంటూనే గ్లామ‌ర్ కురిపించింది. కుటుంబ ప్రేక్ష‌కుల‌కు కాజ‌ల్ ద‌గ్గ‌ర అవ్వ‌డానికి కార‌ణం అదే. అయితే... తొలిసారి కాజ‌ల్ హాట్ గా, బోల్డ్‌గా క‌నిపించ‌బోతోంద‌ట‌. అయితే సినిమాలో కాదు. ఓ వెబ్ సిరీస్ కోసం. కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ఓ వెబ్ సిరీస్ తెర‌కెక్క‌బోతోంది.

 

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళంతో పాటు, హిందీలోనూ ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించ‌నున్నారు. ఈ వెబ్ సిరీస్ లో కాజ‌ల్ పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుంద‌ట‌. కొన్ని హాట్ స‌న్నివేశాల్లో కాజ‌ల్ క‌నిపించ‌నుంద‌ని, ఇంత‌కు ముందు న‌టించ‌ని పాత్ర‌లో కాజ‌ల్ మెరుస్తుంద‌ని స‌మాచారం. వెబ్ సిరీస్ లో అలాంటి కంటెంటే ఇప్పుడు వ‌ర్క‌వుట్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో ముగ్గురు యువ హీరోలు కూడా క‌నిపించ‌నున్నార్ట‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రాణిస్తున్న యువ క‌థానాయ‌కులే ఈ వెబ్ సిరీస్‌లో కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నార‌ని తెలుస్తోంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

ALSO READ: Kajal Aggarwal Latest Photoshoot