ENGLISH

దేవ‌ర: షాకింగ్ న్యూస్‌ చెప్పిన క‌ల్యాణ్ రామ్‌

26 December 2023-20:24 PM

'ఆర్‌.ఆర్‌.ఆర్' త‌ర‌వాత ఎన్టీఆర్ నుంచి మ‌రో సినిమా రాలేదు. అంద‌రి క‌ళ్లూ 'దేవ‌ర‌'పైనే. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2024 మార్చిలో ఈ చిత్రం రాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆ షాకింగ్ విష‌యం చెప్పాడు నిర్మాత క‌ల్యాణ్ రామ్‌.


'దేవ‌ర‌' షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్త‌యిపోయింద‌ట‌. నాలుగు నెల‌ల ముందే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకొన్నారంటే మామూలు విష‌యం కాదు. జ‌న‌వ‌రిలోగా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఫిబ్ర‌వ‌రిలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్త‌యితే.. మార్చిలో ప్ర‌మోష‌న్లు చేసుకోవొచ్చు. అంటే కొర‌టాల శివ ఆన్ టైమ్ లోనే ఉన్నాడ‌న్న‌మాట‌.


'దేవ‌ర‌' అప్ డేట్ గురించి ఎన్టీఆర్ అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్త‌యిందంటే టీజ‌ర్ విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ద‌మైన‌ట్టే. ఈ విష‌యంలో కూడా క‌ల్యాణ్ రామ్ ప‌క్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. 'దేవ‌ర‌'కు సంబంధించిన అప్ డేట్ జ‌న‌వ‌రిలో ఇవ్వ‌డానికి టీమ్ రెడీగా ఉంద‌ని తెలుస్తోంది. సంక్రాంతికి టీజ‌ర్ విడుద‌ల చేసి, అప్ప‌టి నుంచీ వ‌రుస అప్ డేట్లు ఇవ్వాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంద‌ని స‌మాచారం. ఇక నుంచి 'దేవ‌ర' టైమ్ స్టార్ట్ అయిన‌ట్టే.