ENGLISH

ప‌వ‌న్ సినిమా త‌ర‌వాత రిటైర్‌మెంటే!

26 December 2023-20:45 PM

పొగ‌రు సినిమాతో అంద‌రినీ ఆక‌ట్టుకొన్న న‌టి.. శ్రేయా రెడ్డి. ఇప్పుడు స‌లార్‌లోనూ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. స‌లార్‌లో త‌ను క‌నిపించింది కాసేపే. అయితే పార్ట్ 2లో మాత్రం త‌న పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంద‌ని, స‌లార్ 2 చూశాక‌... త‌న‌కు అభిమానులు పెరుగుతార‌ని న‌మ్మ‌కంగా చెబుతోంది శ్రియా రెడ్డి. ప‌వ‌న్ క‌ల్యాణ్ 'ఓజీ'లోనూ శ్రియా న‌టిస్తోంది. ఈ సినిమా గురించి ఎప్పుడు చెప్పినా... చాలా ఎమోష‌న‌ల్ అయిపోతోంది శ్రియా. ఈసారి కూడా ఓజీ గురించి ఓ రేంజ్ లో చెప్పింది.


''పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఓ అద్భుతమైన స్క్రిప్ట్. ఎమోషనల్ రోలర్ కోస్టర్ మూవీ. యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయి. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మి వంటి గొప్ప నటీనటులు ఈ సినిమాలో ఉన్నారు. వాళ్ల‌తో న‌టించ‌డం నా అదృష్టం'' అంది. ఈ సినిమాలో త‌న‌ది నెగిటివ్ రోల్ కాద‌ని క్లారిటీ ఇచ్చేసింది.


''ఓజీ చిత్రంలో నేను నెగటివ్ రోల్ చేయటం లేదు. సినిమాలో నాకు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రిలేషన్, పాత్ర గురించి చెప్పను. ఇప్పుడు ఎక్కువ వివరాలు చెప్పలేను. సలార్, ఓజీల్లో చాలా డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాను. ఓజీ తర్వాత రిటైర్డ్ అయిపోతానేమో. నా రోల్ అంత గొప్పగా ఉంటుంది'' అంది శ్రియా. ఈ స్టేట్‌మెంట్ల‌తో ఓజీపై మ‌రింతగా అంచ‌నాలు పెరిగిపోయాయి.