ENGLISH

Zaid Khan: పవన్ కళ్యాణ్ కి సారీ చెప్పాలి : జైద్ ఖాన్

30 October 2022-12:02 PM

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన 'బనారస్‌'తో సినిమా రంగ ప్రవేశం చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ప్రమోషన్స్ చేశారు. వైజాగ్ లో ఒక ఈవెంట్ నిర్వహించారు. ప్రమోషన్స్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలసే అవకాశం వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు సమయానికి జైద్ అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయంలో చాలా నిరాశ వ్యక్తం చేశాడు జైద్.

 

'పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ ని కలిసే అవకాశం వచ్చింది. మా తెలుగు ట్రైలర్ ఆయన చేతుల మీదగా విడుదల చేయాలనీ అనుకున్నాం. కానీ సమయానికి నాకే కుదరలేదు. ఈ విషయంలో ఆయనకి క్షమాపణలు చెప్తాను. మరోసారి ఆయన్ని కలవడానికి ప్రయత్నిస్తాను. బనారస్ పాన్ ఇండియా కంటెంట్ వున్న సినిమా. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది'' అని చెప్పుకొచ్చారు జైద్.

ALSO READ: 'గాడ్ ఫాద‌ర్' ఫైన‌ల్ రిపోర్ట్‌.... షాక్ లో మెగా ఫ్యాన్స్‌