ENGLISH

Samantha: తన అనారోగ్యం గురించి చెప్పిన సమంత

30 October 2022-11:31 AM

సమంత తన అనారోగ్య సమస్య గురించి చెప్పింది. తాను ‘మయోసైటిస్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెళ్ళించింది. చేతికి సెలైన్ తో ‘యశోద’ సినిమాకి డబ్బింగ్‌ చెబుతూ వున్న ఒక ఫోటోని షేర్ చేసింది. గత కొన్ని నెలల నుంచి ‘మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నానని పేర్కొంది.

 

''అన్నిసార్లూ బలంగా ముందుకు వెళ్లలేమని అర్ధమైయింది. అన్నిటిని స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా లైఫ్ లో మానసికంగా, శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది’’ అని పోస్ట్ చేసింది సమంత.

ALSO READ: 'గాడ్ ఫాద‌ర్' ఫైన‌ల్ రిపోర్ట్‌.... షాక్ లో మెగా ఫ్యాన్స్‌