ENGLISH

మొన్న శృతిహాసన్‌, ఇప్పుడు కత్రినాకైఫ్‌

17 June 2017-12:41 PM


శృతిహాసన్‌ కత్తి పట్టి కొన్నాళ్ళ క్రితం నానా హంగామా చేసింది. విదేశాలకు వెళ్ళి కత్తి యుద్ధాల్లో మెలకువలు నేర్చుకుంది శృతిహాసన్‌. ఇదంతా 'సంఘమిత్ర' సినిమా కోసమే. అయితే ఎంత కష్టపడ్డా శృతిహాసన్‌కి ఫలితం దక్కలేదు. ఆ సినిమా నుంచి ఆమె తప్పుకుంది. తప్పుకుందో, తప్పించేశారోగానీ శృతిహాసన్‌ కష్టం వృధా అయిపోయింది. ఇప్పుడు ఇంకో బ్యూటీ కూడా ఇప్పుడు కత్తిపట్టి పబ్లిసిటీ స్టంట్లు చేసేస్తోంది. ఈ బ్యూటీ ఇంకెవరో కాదు మన 'మల్లీశ్వరి' కత్రినాకైఫ్‌. తెలుగులో 'మల్లీశ్వరి', 'అల్లరి పిడుగు' సినిమాల్లో నటించిన కత్రినాకైఫ్‌, బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. అక్కడ నెంబర్‌ వన్‌ రేసులో సత్తా చాటుతోంది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా రూపొందనున్న 'టైగర్‌ జిందా హై' సినిమా కోసమే కత్రినాకైఫ్‌ ఇప్పుడు కసరత్తులు ప్రారంభించింది. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. చాలా కాలం తర్వాత సల్మాన్‌, కత్రినా కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమా కోసమే కత్రినా కత్తి పట్టి వీరావేశంతో యుద్ధాలు చేసేస్తోంది. కత్తి సాముతోపాటుగా గన్‌ షూటింగ్‌ కూడా చేసేస్తోంది కత్రినా. ఇందుకోసం ప్రత్యేకించి శిక్షణ తీసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. కత్తిసాము, గన్‌ షూట్స్‌లో కత్రినా గట్స్‌ విజువల్‌గా చాలా బాగున్నాయి. ఇది జస్ట్‌ ట్రైల్‌ మాత్రమే. ఇంతవరకూ గ్లామర్‌ పాత్రలతో ఆకట్టుకున్న కత్రినా, 'టైగర్‌ జిందా హై' సినిమాతో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో అలరించనుంది.

ALSO READ: ఎన్టీఆర్ బిగ్ బాస్ కి తమన్ తళుకులు