ENGLISH

మ్యూజియంలో కట్టప్ప విగ్రహం

13 March 2018-12:26 PM

బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారతీయ చిత్రపరిశ్రమ పేరుని ప్రచారం చేసిన చిత్రం. ఇక సినిమా పరంగా బాహుబలిలో కొన్ని ముఖ్యపాత్రలు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయేలా చేసింది. అలాంటి పాత్రలలో ఒకటి కట్టప్ప.

బాహుబలి మొదటిభాగం చివరలో “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?” అన్న ప్రశ్న యావత్ దేశాన్నే ఒక ఊపు ఊపింది అని చెప్పొచ్చు. ఇక ఇంతటి ప్రాచుర్యం పొందిన ఈ పాత్రకి ఒక అరుదైన గౌరవం దక్కబోతున్నది. అదేమనగా- కట్టప్ప మైనపు విగ్రహం లండన్ లోని ప్రముఖ మేడం టుస్సాడ్స్ మ్యుజియంలో పెట్టబోతున్నారట.

ఈ విషయాన్నీ ఆయన కొడుకు సోషల్ మీడియాలో వారి అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఇంతటి ప్రఖ్యాత మ్యూజియంలో తొలి తమిళ నటుడి విగ్రహం సత్యరాజ్ దే కావడం విశేషం.

పోయిన ఏడాది ఇదే మ్యూజియంలో బాహుబలి పాత్ర విగ్రహం ఏర్పాటు చేశారు.

 

ALSO READ: అర్జున్ రెడ్డి లవర్ గా టాప్ హీరోయిన్ కూతురు..