ENGLISH

అమితాబ్ కేబీసీ షో లో పవన్

14 September 2024-14:24 PM

హిందీలో పాపులర్ షో లలో కేబీసీ ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ హోస్ట్‏గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కి దేశ వ్యాప్తంగా మంచి పాజిటీవ్ టాక్ ఉంది. ప్రస్తుతం కేబీసీ సీజన్ 16 రన్ అవుతోంది. ఈ సీజన్ వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది. తెలుగులో కూడా ఈ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అని ప్రసారమయ్యింది. చిరంజీవి, నాగార్జున హోస్ట్ లుగా వ్యవహరించారు. అయితే ఇపుడు హిందీ కేబీసీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ప్రశ్న రావటం గమనార్హం. కేబీసీ లాంటి హైయ్యెస్ట్ వ్యూస్ ఉన్న షో లో పవన్ ప్రశ్న రావటం ఫాన్స్ కి పండగలా ఉంది. అదీ పవర్ స్టార్ క్రేజ్ అంటే అని భుజాలు ఎగరేస్తున్నారు.


వివరాల్లోకి వెళ్తే అమితాబ్ కంటెస్టెంట్ ని '2024 జూన్‌లో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న నటుడు ఎవరు' అని అడిగారు. ఆప్షన్స్ లో పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ పేర్లను ఇవ్వగా అతను నార్త్ వాడు కావటంతో కన్ఫ్యూజన్ తో 'ఆడియన్స్‌ పోల్‌' ఆప్షన్‌ తీసుకుని ఆన్సర్ చెప్పాడు. ఈ ఆన్సర్ కి 1.60 లక్షలు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అమితాబ్ పవన్ గూర్చి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. 
  

'పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటుడు అని పొగుడుతూ, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడని, పవన్ జనసేన పార్టీ పెట్టి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారని వివరించారు అమితాబ్. కేబీసీ లో పవన్ ప్రస్తావన రావటం, బిగ్ బీ నోట పవన్ పై ప్రశంసలు ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ ఫ్యాన్స్, ఈ వీడియోని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.