ENGLISH

వన్‌ అండ్‌ ఓన్లీ 'మహానటి' కీర్తి సురేష్‌

17 October 2017-19:25 PM

ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'మహానటి'. మహానటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటిస్తోంది. ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ యాక్టింగ్‌ టాలెంట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ సినిమా కోసం ఎంతమందో హీరోయిన్లను పరిశీలించి, చివరికి ఆ ఛాన్స్‌ కీర్తి సురేష్‌కి దక్కడం జరిగింది. తాజాగా ఈ సినిమా నుండి ఓ స్టిల్‌ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఈ రోజు ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ పుట్టినరోజు. ఆ సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ఈ పోస్టర్‌ విడుదల చేశారు. 'ఆకాశ వీధిలో అందాల జాబలి.. హ్యాపీ బర్త్‌డే టు ఒన్‌ అండ్‌ ఓన్లీ మహానటి కీర్తి సురేష్‌ ..' అనే ఈ పోస్టర్‌పై కీర్తి సురేష్‌ కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కళ్లే ఆమెను ఈ సినిమాకు ఎంపిక చేసుకునేందుకు కారణమయ్యాయి. సావిత్రి కళ్లతోనే అనేక భావాలు పలికించగల నటనా పాఠవం ఉన్న నటి. ఆమె చూపుల్లోని హాంకార్యం, ఎన్నో రకాల భావాలను పలికించేది. అలాంటి కళ్లున్న కీర్తి సురేష్‌ ఈ ఫోటోలో అచ్చం సావిత్రినే తలపిస్తుండడం విశేషం. వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు, ముద్దుగుమ్మ సమంత కీలక పాత్రలో పోషిస్తోంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా, పవన్‌ కళ్యాణ్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా టీమ్‌ ఈ చిత్రంలోని కీర్తి సురేష్‌ స్టిల్‌ని రిలీజ్‌ చేస్తూ, ఈ ముద్దుగుమ్మకి బర్త్‌డే విషెస్‌ని తెలిపింది.

ALSO READ: సావిత్రిలో ఇద్దరు డైరెక్టర్లు