యంగ్ హీరో కార్తి నటించిన 'ఖైదీ' సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. తెలుగులో డబ్ అయిన ఈ చిత్రం అక్కడా ఊహించని వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బాలీవుడ్‌నీ ఖైదు చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఓ ప్రముఖ హీరో ఈ సినిమాని రీమేక్ చేసే యోచనలో ఉన్నాడట. ఇప్పటికే రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, డ్రీమ్ వారియర్స్ సంస్థలు ఈ సినిమాని నిర్మించే యోచనలో ఉన్నాయి. అనౌన్స్‌మెంట్ కూడా చేసేశాయి. ఇక కాస్టింగ్ దొరికితే, సినిమా పట్టాలెక్కడమే తరువాయి. హీరో విషయం దాదాపు ఫైనల్ అయ్యేలానే ఉంది. సౌత్ సినిమాల్ని రీమేక్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన బాలీవుడ్ హీరో ఈ రీమేక్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఆ హీరో కాంబినేషన్‌లోనే సినిమా తెరకెక్కితే, బాలీవుడ్ జనాల్ని కూడా లాక్ చేయడం ఖాయమంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తండ్రీ, కూతురు సెంటిమెంట్ బ్యాక్ గ్రౌండ్‌లో రూపొందిన సినిమా ఇది. చూడాలి మరి, బాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్ని ఎలా 'ఖైదీ' చేయనుందో.!
ALSO READ: మెట్టు దిగినా క్యారెక్టర్ హిట్టు కాదే!