ENGLISH

పూజా హెగ్దే కాదు.. పూజా లెగ్‌ డే: సిరాశ్రీ చాతుర్యం.!

04 February 2020-16:01 PM

తెలుగు సినిమాల్లో హీరోయిన్లు పొట్టి స్కర్టులేసుకుని కన్పించడం కొత్తేమీ కాదు. అలా 'చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప'ల అందాన్ని సినీ కవులు అభివర్ణించడమూ కొత్త కాదు. బోల్డన్ని డైలాగులు.. బోల్డన్ని పాటలు.. ఇవన్నీ ఓ ఎత్తు.. 'అల వైకుంఠపురములో' ఇంకో ఎత్తు. సినిమాలో హీరో, హీరోయిన్‌ కాళ్ళని ఆరాధిస్తాడు. ఎంతలా.? అంటే, 'నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి నా కళ్ళు..' అంటూ పాటందుకునేలా. ఆ పాట, ఆ మాట.. అన్నీ అదరహో అన్పించాయి కాబట్టే, 'అల వైకుంఠపురములో' సినిమా అంత పెద్ద హిట్టయ్యింది. సినిమా అంత హిట్టయ్యింది కాబట్టే, సినిమాలో పూజా హెగ్దే 'కాళ్ళ ప్రదర్శన' ఇప్పటికీ ఓ ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గానే కొనసాగుతోంది. తాజాగా పాటల రచయిత సిరాశ్రీ, పూజా హెగ్దే కాళ్ళ గురించి ఓ ఆసక్తికరమైన ట్వీటేశారు.

'అల వైకుంఠపురములో' హీరోయిన్‌ ఎవరంటే గబుక్కున పూజా 'లెగ్‌ డే' అని వస్తోంది. త్రివిక్రమ్‌ గారి ఎఫెక్ట్‌. విత్‌ డ్యూ రెస్పెక్ట్‌ టు పూజా హెగ్దే.. అంటూ సిరాశ్రీ వేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. పూజా హెగ్దేలోని హెగ్దేని ఇంగ్లీషు అక్షరాల్లో రాస్తే 'హెచ్‌.ఇ.జి.డి.ఇ.' అవుతుంది. దాన్ని 'ఎల్‌.ఇ.జి.డి.ఎ.వై.'గా అని అన్పించడం రైటే కదా.! అన్నట్టు, సినిమా ప్రమోషన్స్‌ కూడా పూజా హెగ్దే అందమైన కాళ్ళ చుట్టూనే జరిగాయండోయ్‌. ఇదిలా వుంటే, ఇండస్ట్రీ హిట్‌:గా తమ సినిమా నిలవడం పట్ల పూజా హెగ్దే హర్షం వ్యక్తం చేస్తూ, సోషల్‌ మీడియాలో ట్వీటేసింది తాజాగా. ఈ సందర్బంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిందీ పూజా లెగ్‌ డే.. అదేనండీ పూజా హెగ్డే.

ALSO READ: 'పింక్‌' రీమేక్‌లో మార్పులు ఎక్కువే!