ENGLISH

పవన్ కళ్యాణ్ సరసన చరణ్ హీరోయిన్?

04 January 2021-17:02 PM

పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు ఇప్పుడు నిర్మాణంలో వున్నాయి. అందులో ‘వకీల్ సాబ్’ ఇప్పటికే సినిమా నిర్మాణం పూర్తి చేసుకున్న విషయం విదితమే. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, పవన్ సరసన కొత్త సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కైరా అద్వానీ పేరు పరిశీలనలో వుందట.

 

ఇప్పటికే ఈ విషయమై కైరా అద్వానితో సంప్రదింపులు షురూ అయ్యాయనీ, ఆమె కూడా సానుకూలంగా వుందనీ అంటున్నారు. తెలుగులో చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాలోనూ, మహేష్ సరసన ‘భరత్ అనే నేను’ సినిమాలోనూ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. అయితే, ఆ తర్వాత ఆమె మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు.

 

బాలీవుడ్‌లో మాత్రం ఆమె వరుస సినిమాలతో బిజీగా వుంది. అనూహ్యంగా ఆమెకు వచ్చిన క్రేజ్, దాంతోపాటుగా పాన్ ఇండియా ఆలోచనలతో టాలీవుడ్ పరుగులు.. వెరసి కైరాకి మంచి డిమాండ్ ఏర్పడుతోంది తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి. చరణ్ సరనే ‘ఆచార్య’ సినిమా కోసం కూడా కైరా పేరు పరిశీలిస్తున్నారు. పవన్ సరసన అలాగే ప్రభాస్ సరసన.. ఆమె సినిమాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ALSO READ: మ‌న‌కెప్పుడు 100కి 100?