రామ్ చరణ్ -శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంలో కథానాయికగా కైరా అద్వాణీ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా కోసం కైరా తీసుకున్న పారితోషికం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.4.5 కోట్లు డిమాండ్ చేసిందని, దిల్ రాజు కూడా అడిగినంత ఇచ్చాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో నిజంగా కియారాకి అంత ఇచ్చారా? తనకు అంత ఉందా? అనే సందేహాలు నెలకున్నాయి.
ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా కోసం కూడా... కియారానే అడిగారు. ఆ సినిమాని కాదనుకుని శంకర్ సినిమాకి డేట్లు ఇచ్చింది కియారా. పైగా శంకర్ ది పాన్ ఇండియా సినిమా. బాలీవుడ్ లోనూ కియారాకి మంచి క్రేజ్ ఉంది. అందుకే తనకి ఇంత డిమాండ్ అని టాక్. అయితే నిజానికి కియారాకి అంత ఇవ్వలేదని, తన పారితోషికం 2 కోట్లకు మించదని మరో వాదన వినిపిస్తోంది. తమన్నా, శ్రుతి, కీర్తి సురేష్, రష్మికలకే పారితోషికం అంత లేదని, అలాంటప్పుడు కియారాకి అంత ఎందుకిస్తారని? పైగా దిల్ రాజు లెక్కలు తెలిసిన మనిషని, పారితోషికం ఇచ్చే విషయంలో మరీ పిసినారి అని.. అందుకే కియారాకి 2 కోట్లు మించవని మరో వాదన వినిపిస్తోంది. మొత్తమ్మీద కియారా ఈ విషయంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ALSO READ: Kiara Advani Latest Photoshoot