ENGLISH

క్రేజీ ప్రాజెక్ట్ లో కియారా

23 April 2024-15:17 PM

ప్రభాస్ గత ఏడాది 'సలార్' మూవీతో బాక్సాఫిస్ దగ్గర సందడి చేశాడు. ఈ చిత్రం ఇయర్ ఎండింగ్  డిశంబర్లో రిలీజ్ అయ్యి వసూళ్ల వర్షం  కురిపించింది. వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ సుమారు వెయ్యి కోట్లు వసూలు చేసింది. నెక్స్ట్ సలార్ 2 కోసం సినీ ప్రియులు ఈగర్లీ వెయిటింగ్. సలార్ 2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ 2 షూటింగ్ మొదలయినట్టు మూవీ యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సలార్‌ 2 కూడా వన్ కి మించి ఉంటుందని టాక్.  యాక్షన్‌ , ఎమోషన్స్‌ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని ర్యూమర్లు వినిపిస్తున్నాయి. 
 

సలార్ పార్ట్ 1 లో హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది. మొదటి పార్ట్ లో కథ మొత్తం శృతి హాసన్ చుట్టూ తిరగటం విశేషం. ఇప్పుడు సలార్‌ 2 లో ఇంకొక హీరోయిన్ ఉండనుందని, ఆమె లీడ్ రోల్ అని సమాచారం. అంటే శృతితో పాటు ఇంకో  హీరోయిన్ కూడా సలార్ 2 లో కనిపించనుంది. ఆమె మరెవరో కాదు పాన్ ఇండియా హీరోయిన్ కియారా అద్వానీ. కియారా అయితే బాగుంటుందని ప్రశాంత్ నీల్ ఈమెను సంప్రదించినట్టు, కథతో పాటు, తన పాత్ర కూడా నచ్చటంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 


కియారాకి అన్ని భాషల్లో మంచి ఫాలోయింగ్ వుంది. తెలుగు, తమిళం , హిందీ భాషల్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. ప్రజంట్ రామ్ చరణ్‌, శంకర్ కాంబోలో వస్తున్న గేమ్‌ చేంజర్ కూడా కియారే నటిస్తోంది. ఇప్పుడు ఏకంగా సలార్ 2 లో ప్రశాంత్ నీల్ , ప్రభాస్ ల క్రేజ్ కాంబోలో నటించే ఛాన్స్ రావటం కియారా లక్ అని అంతా కామెంట్స్ చేస్తున్నారు.