ENGLISH

చిరుతో విజయశాంతి... నిజమేనా?

23 April 2024-15:15 PM

కొన్ని కాంబినేషన్స్ స్క్రీన్ పై ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ ల జోడిలు కొన్ని ఆన్ స్క్రీన్ పై వర్కౌట్ అవుతుంటాయి. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, వరుస హిట్ ల వలన కానీ ఎన్ని ఏళ్ళు అయినా ఇలాంటి జోడీలకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంటారు. అలాంటి సూపర్ హిట్ జోడి  మెగాస్టార్ చిరంజీవి, విజయ శాంతి లది. వీరి కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చాయి. వీటి సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. విజయ శాంతి చాలా ఏళ్లుగా సినిమాలకి దూరంగా ఉండి, రాజకీయాలకే అంకితం అయిపోయారు. మహేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ అనే మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఈ మూవీ తరవాత విజయశాంతి కమ్ బ్యాక్ ఇచ్చారు, వరస సినిమాలు చేస్తూ మళ్ళీ ఫ్యాన్స్ ని అలరిస్తారనుకుంటే ఇప్పటివరకు ఇంకో సినిమాలో నటించలేదు. కానీ రీసెంట్ గా వచ్చిన వార్త ప్రకారం చిరుతో కలిసి నటించనున్నట్లు సమాచారం.


చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టారు. చిరు పక్కన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. చిరు ఈ మూవీకోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని టాక్. బాడీ డబుల్ లేకుండా ఈ ఏజ్ లో కూడా ఫుల్ యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నారని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారక్టర్ లో విజయ శాంతిని సంప్రదించినట్టు తెలుస్తోంది. 
 

వీరి మధ్య ఏవో మనస్పర్థలు ఉన్నాయని, తరవాత కాలంలో అందుకే కలిసి నటించలేదని ర్యూమర్లు ఉన్నాయి. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమా వేడుక సమయంలో చిరంజీవి, విజయశాంతి ఛాన్స్ వస్తే కలిసి నటిస్తామని అన్నారు. ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్న విజయ శాంతి మళ్ళీ సినిమాల్లో నటించటానికి ఇంట్రస్టు చూపిస్తారా లేదా? అదీ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవటానికి ఒప్పుకుంటారా లేదా అని చూడాలి. నిజంగా విజయశాంతి ఈ ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమెకి, సినిమాకి కూడా ప్లస్ అవుతుంది. వీరిద్దర్నీ కలిసి చూడాలన్న ఫాన్స్ కోరిక చాలా ఏళ్ళ తరవాత తీరనుంది.