ఎదగాలన్న సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని మరొకసారి నిరూపించాడు కిరణ్ అబ్బవరం. దీపావళి సందర్భంగా 'క' మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు కిరణ్ . మొదటి పాన్ ఇండియా సినిమా కిరణ్ కి గుర్తింపు తెచ్చింది. ఎన్ని అవమానాలు ఎదురైనా, అడ్డంకులు వచ్చినా తన ఎదుగుదలకి చూసి ఓర్వలేని వారు ఈర్ష్యా అసూయలు చూపినా అవన్నీ జయించి ఇప్పుడు ఆడియన్స్ ప్రేమ అందుకున్నాడు. క ప్రీమియర్ షో ల నుంచే పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది. 'క' మూడు రోజుల్లో 19.41 కోట్లు కలక్ట్ చేసింది. టీమ్ అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. 'క' సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వన్ కి మించిన ట్విస్ట్ లు ఉంటాయని హింట్స్ ఇస్తున్నారు.
చాలా మంది సినిమా చేశామా, రిలీజ్ అయ్యిందా లేదా అన్నట్టు ఉంటారు కానీ కిరణ్ అలా కాదు సినిమా ముందు ఎంతలా ప్రమోషన్స్ నిర్వహించాడో? సినిమా రిలీజ్ అయ్యి, హిట్ టాక్ తెచ్చుకుని, భారీ వసూళ్లు వస్తున్నా విశ్రమించకుండా ఇంకా జనాల్లోకి తీసుకువెళ్ళడానికి కష్టపడుతున్నాడు. ప్రమోషన్స్ లో కిరణ్ మాట్లాడుతూ కొత్తగా పెళ్లి అయ్యింది. కానీ క షూటింగ్ లో ఉండిపోయి ఇంటికి 20 రోజులు వెళ్లలేదని తెలిపాడు. సినిమా రిలీజ్ అయ్యాక హాయిగా భార్యతో కలిసి ఎక్కడికైనా వెళ్తా అని చెప్పాడు. చూస్తే ఇంకా 'క' మూవీ కోసమే కష్టపడుతున్నాడు.
ఇది కదా అసలైన డెడికేషన్ అంటే. ఆదివారం AMB సినిమాస్ లో 'క' టికెట్స్ అమ్ముతూ కనిపించాడు కిరణ్. ఒక వైపు టికెట్స్ సేల్ చేస్తూ ఫాన్స్ తో సెల్ఫీ లు దిగుతూ, సినిమా స్టార్ట్ అయ్యాక థియేటర్ లోకి వెళ్లి ఫాన్స్ తో ముచ్చటించాడు. సినిమా చూడటానికి వచ్చినవారికి ధన్యవాదాలు తెలిపాడు. కిరణ్ ఇంత కష్టపడాల్సిన పని లేదు ఇప్పటికే క మూవీకి మంచి ఆదరణ దొరికింది. జనాల్లోకి మౌత్ టాక్ వెళ్ళిపోయింది. అయినా మరిన్ని కలెక్షన్ల కోసం ప్రతి రోజూ ప్రమోషన్స్ నిర్వహిస్తూనే ఉన్నాడు. మిగతా వారు కూడా కిరణ్ లా ఆలోచిస్తే నిర్మాతకి లాభాలే లాభాలు.