టాలీవుడ్ ది వందేళ్ల సినీ ప్రయాణం. ఎంతో ఘన చరిత్ర ఉన్న తెలుగు సినిమా నటీనటులకి నేషనల్ అవార్డు అన్నది కలగానే మిగిలిపోయింది. ఎన్టీఆర్, ANR , కృష్ణ, శోభన బాబు లాంటి అతిరథ మహారథులకి నేషనల్ అవార్డు రాలేదు. వారి తరువాత వచ్చిన జనరేషన్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎవరికీ నేషనల్ అవార్డు రాలేదు. ఈ మధ్యే అల్లు అర్జున్ ఈ ఘనత సాధించారు. పుష్ప 2 కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు బన్నీ. ఇది హర్షించ దగ్గ విషయమే. అంత మందికి దక్కని అదృష్టం బన్నీకి దక్కింది. ప్రస్తుతం నేషనల్ అవార్డ్ ఎప్పుడో చిరుకి రావాల్సింది అన్న చర్చ నడుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే 2006 లో పద్మ భూషణ్, 2024 లో పద్మ విభూషణ్ లాంటి గౌరవపురస్కారాలు అందుకున్నారు. ఇవి కాక లెజండ్రీ అవార్డు కూడా అందుకుని కొన్ని వివాదాల కారణంగా టైం కాప్సిల్స్ లో ఉంచారు. ఇదే ఏడాది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు, ANR నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలతో సమానంగా కష్ట పడుతూ వారికి మంచి పోటీ ఇస్తున్నారు. కానీ మెగా ఫాన్స్ కి ఒకే ఒక్క లోటు ఉండిపోయింది. అదే మెగాస్టార్ కు నేషనల్ అవార్డు రాకపోవటం. అయితే చిరుకి ఎప్పుడో జాతీయ అవార్డు వచ్చి ఉండేదని, కావాలనే కొందరు కుట్ర చేసి రాకుండా చేసారని ప్రముఖ నిర్మాత, నటుడు శ్రీరామ్ అన్నారు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరామ్, చిరు గూర్చి ప్రస్తావిస్తూ 'ఆపద్బాంధవుడు' సినిమాకు చిరుకి నేషనల్ అవార్డు వచ్చి ఉండేదని, అప్పటికే ఫిక్స్ చేసారని, అనౌన్స్ చేయాల్సి ఉందనగా లాస్ట్ మినిట్ లో నార్త్, సౌత్ అనే వేరియేషన్స్ తో నార్త్ హీరో కి ఇచ్చారని వ్యాఖ్యానించారు. శ్రీ రామ్ చిరుతో మూడు సినిమాలు తీశారు. ఒకటి 'తాయారమ్మా బంగారయ్యా ' రెండు స్వయం కృషి, మూడోది ఆపద్బాంధవుడు. నిజంగా టాలెంట్ చూసి అవార్డు ఇచ్చినట్లయితే అప్పుడే చిరంజీవికి ఈ అవార్డు దక్కి ఉండేదని ఆయన వాపోయారు. ప్రజంట్ శ్రీరామ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
. @KChiruTweets గారికి #ఆపద్బాంధవుడు చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది, ఇక ప్రకటిస్తారు అనగా నార్త్ - సౌత్ అనే తేడాతో చివరి నిమిషంలో వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారు. లేకపోతే తెలుగులో మొట్టమొదటి నేషనల్ అవార్డు ఆయనకే వచ్చేది.
— Praveen (@AlwaysPraveen7) November 3, 2024
- నిర్మాత, నటుడు శ్రీరామ్ pic.twitter.com/yPtD3Ev2uU