ENGLISH

కోడి పాట అదిరింది

22 June 2018-12:39 PM

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'విజేత' నుండి ఫస్ట్‌ ఆడియో సింగిల్‌ రిలీజ్‌ అయ్యింది. 'కొక్కొరోకో..' అంటూ సాగే ఈ ఆడియో సింగిల్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. కోడితో ఇన్ని రకాల వంటకాలు చేస్తారా? అనిపించేలా రకరకాల పేర్లు ప్రస్థావించారీ పాటలో. ఇది ఆడియో సింగిల్‌ కాబట్టి ఇందులో కళ్యాణ్‌దేవ్‌ డాన్స్‌ ఎబిలిటీస్‌ ఏమీ కనిపించలేదు. 

అక్కడక్కడా రెండు, మూడు స్టెప్పులు కనిపించాయి అంతే. ప్రేమ్‌ రక్షిత్‌ కంపోజేషన్‌లో ఈ పాట చిత్రీకరించారు. ప్రేమ్‌రక్షిత్‌ డాన్సులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి వచ్చాడు కదా, కళ్యాణ్‌దేవ్‌ని అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు. హీరోగా అన్నింట్లోనూ ప్రత్యేక శిక్షణ తీసుకునే తెరంగేట్రం చేశాడు కాబట్టి. డాన్సులు బాగానే చేస్తాడు. నో డౌట్‌. 

ఇకపోతే రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఈ పాటలోని భావాలు చాలా క్యాచీగా ఉన్నాయి. రాకేష్‌ శశి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయి కొర్రపాటి నిర్మాణంలో వారాహి చలన చిత్ర బ్యానర్‌లో రూపొందుతోంది. మాళవికా నాయర్‌ ఈ సినిమాలో కళ్యాణ్‌దేవ్‌తో జత కడుతోంది. ఫస్ట్‌ ఆడియో సింగిల్‌ బయటికి వచ్చేసింది. దుమ్ము దులిపేస్తోంది. కోడి పాట అందరికీ నోరూరించేస్తోంది. ఇక మిగిలిన పాటల ఫీల్‌ని కూడా అనుభవించేయడానికి రెడీగా ఉండంది. 

త్వరలోనే ఈ సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ని ఘనంగా నిర్వహించే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: జంబ లకిడి పంబ మూవీ రివ్యూ & రేటింగ్