ENGLISH

తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా 'థాంక్యూ డియర్' ఫస్ట్ లుక్ లాంచ్!

23 May 2025-20:19 PM

టాలీవుడ్‌లో యువ కథానాయకుడు ధనుష్ రఘుముద్రి నటించిన ‘థాంక్ యూ డియర్’ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఘనంగా జరిగింది. ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్‌ను చూసిన తమ్మారెడ్డి, చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ, ఈ సినిమా ధనుష్‌కు మంచి గుర్తింపు తెస్తుందని, యువ బృందానికి ఆశీస్సులు అందజేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.


ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ, ‘థాంక్ యూ డియర్’ తన రెండో చిత్రమని, తమ్మారెడ్డి లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ తమ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో కీలకమైనదని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రం ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుందని, తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం తమకు ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


లైన్ నిర్మాత పుణీత్ రెడ్డి మాట్లాడుతూ, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సినీ పెద్ద ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం సంతోషకరమని, సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని తెలిపారు. ఈ చిత్రం యువతని కచ్చితంగా ఆకట్టుకొని విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


నటి నటులు - హెబా పటేల్ , ధనుష్ రఘుముద్రి , రేఖ నిరోషా, వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ - శ్రీనివాస్ నాయుడు


బ్యానర్ : మహా లక్ష్మి ప్రొడక్షన్స్ 
ప్రొడ్యూసర్ : పప్పు బాలాజీ రెడ్డి 
రైటర్ & డైరెక్టర్ - తోట శ్రీకాంత్ కుమార్  
ఎడిటర్ : రాఘవేంద్ర పెబ్బేటి 
మ్యూజిక్ - సుభాష్ ఆనంద్ 
డి ఓ పి : పి ఎల్ కె రెడ్డి 
లైన్ ప్రొడ్యూసర్ - బలిజ పునీత్ రాయల్ 
కో ప్రొడ్యూసర్ - పి బి వి వి సత్య నారాయణ 
కస్టమ్ డిజినర్ - భావన పోలిపల్లి 
పి ఆర్ ఓ - మధు వి ఆర్ 
డిజిటల్ - డిజిటల్ దుకాణం