ENGLISH

'భరత్‌'నూ భయపెడుతోన్న లీకు మహమ్మారి

06 October 2017-16:44 PM

టెక్నాలజీ పెరిగిపోవడంతో పెరిగిపోయిన లీకుల మహమ్మారి ప్రతీ సినిమానీ భయపెడుతోంది. మొన్నీ మధ్యనే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జై లవకుశ' సినిమా విదేశాల్లో ముందుగానే విడుదలయ్యింది. అక్కడి నుండి సినిమాలోని పలు సీన్స్‌ని నెట్‌లో డౌన్‌లోడ్‌ చేసేశారు. విత్‌ ఇన్‌ సెకన్స్‌లో ఆ సీన్స్‌ ఇండియాని చుట్టేశాయి. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి, శ్రమ పడి తీసిన సినిమాలు విడుదలకు ముందే ఇలా లీకైపోయి చిత్ర యూనిట్‌ని అనేక రకాలుగా దెబ్బ తీస్తున్నాయి. నిర్మాణ సమయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఏదో రకంగా ఈ లీకుల భూతం విరుచుకుపడుతోంది. తాజాగా మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న 'భరత్‌ అను నేను' సినిమాకీ సోకింది ఈ లీకు వైరస్‌. ఈ సినిమా నుండి కొన్ని స్టిల్స్‌ ప్రస్తుతం నెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ విషయం తెలిసి జాగ్రత్త పడిన చిత్ర యూనిట్‌ వెంటనే వాటిని తొలగించి వేసింది. ఈ సందర్భంగా చిత్ర డైరెక్టర్‌ అయిన కొరటాల శివ లీకు వీరుల్ని అర్థించారు దయచేసి ఆ సీన్స్‌ కానీ, స్టిల్స్‌ కానీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయొద్దని కోరారు. 'శ్రీమంతుడు' సినిమా తర్వాత కొరటాల - మహేష్‌ చేస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాలో మహేష్‌బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోందీ సినిమా. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: 'భరత్‌ అనే నేను' స్టిల్ లీక్