ENGLISH

'మహానుభావుడు' - 'స్వచ్ఛ' భారతీయుడు

06 October 2017-16:41 PM

'మహానుభావుడు' సినిమాకి సంబంధించినంత వరకూ శర్వానంద్‌కి ఓసీడీ ప్రాబ్లమ్‌. అదే అతిశుభ్రత. అయితే ఈ అతిశుభ్రాన్ని సినిమా అయిపోయాక కూడా వదలడం లేదు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన 'స్వచ్ఛ భారత్‌' కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 'మహానుభావుడు' హీరో శర్వానంద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని రీల్‌ శుభ్రతే కాదు, రియల్‌ శుభ్రతనీ చాటుకున్నాడు. హైద్రాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో రోడ్లను శుభ్రపరిచాడు హీరో శర్వా. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌తో కలిసి హీరో శర్వానంద్‌ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్‌ మాట్లాడుతూ.. ఈ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం అనేది ఏ ఒక్కరికో సంబంధించిన విషయం కాదు. గవర్న్‌మెంట్‌ ఒక్కదానికి సంబంధించిన బాధ్యత మాత్రమే కాదు. ప్రతీ ఒక్కరూ తమ తమ పరిసర ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్లనే ఈ కార్యక్రమం అసలైన ఫలితాన్నిస్తుంది. అలాగే ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త కారణంగానే అనేక రకాల ప్రాణాంతక వ్యాధులు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి జరుగుతోంది. సో ఎవరో రావాలి ఏదో చెయ్యాలి అన్నట్లుగా కాకుండా, స్వచ్ఛ పరిశుభ్రతని పాఠించడం వల్ల అలాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగల్గుతాం అని శర్వానంద్‌ సూచించాడు. మోడీ శ్రీకారం చుట్టిన ఈ 'స్వచ్ఛ భారత్‌' కార్యక్రమం అభినందించదగ్గదనీ ఈ సందర్భంగా శర్వానంద్‌ అన్నాడు.

ALSO READ: చై, శామ్‌ - సోషల్‌ మీడియా ధూం ధాం