పుష్ప సినిమా వరకు అల్లు అర్జున్ జర్నీ ఒక తీరు పుష్ప తరవాత వేరు అన్నట్టు మారింది సీన్. ఇక పుష్ప 2 తో ఇంటర్నేషనల్ ఫైర్ అయిపోయాడు. హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు బన్నీ. నేషనల్ వైడ్ గా బన్నీతో వర్క్ చేసేందుకు మేకర్స్ లైన్ లో ఉన్నారు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ నెక్స్ట్ సినిమాలపై వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. నెక్స్ట్ బన్నీ త్రివిక్రమ్ తో ఒక సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. అదొక్కటేనా బన్నీ మిగతా ప్రాజెక్ట్స్ పై కూడా చర్చలు జరుగు తున్నాయి.
నార్త్ ఆడియన్స్ కూడా ఖాన్ లను పక్కనపెట్టి బన్నీ సినిమాలకోసం వెయిట్ చేస్తున్నారు. దీనితో కథలపై మరింత శ్రద్ద పెడుతున్నాడు బన్నీ. ఇలాంటి టైం లో కొరటాల శివ, బన్నీని కలవటం ప్రత్యేకతను సంతరించుకుంది. రీసెంట్ గా 'దేవర' మూవీతో పాన్ ఇండియా బోణీ కొట్టిన కొరటాల ఇక నుంచి అన్నీ పాన్ ఇండియా సినిమాలే తీసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అందుకే బన్నీతో చర్చలు జరిపినట్లు టాక్. కొరటాల చేతిలో ప్రస్తుతం దేవర 2 ఉంది. ఈ మూవీ ఫినిష్ చేసాక బన్నీతో వర్క్ చేసేందుకు సిద్ద పడినట్లు తెలుస్తోంది.
గతంలోనే వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉంది. కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాక అది క్యాన్సిల్ అయ్యింది. తరవాత బన్నీ పుష్ప సిరీస్ లతో బిజీ అవటం, కొరటాల ఆచార్య, 'దేవర'లతో బిజీ అయిపోయాడు. బన్నీతో క్యాన్సిల్ అయిన మూవీ కథ అలాగే ఉందని, ఇప్పుడు దాన్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఈ మధ్య కొరటాల బన్నీని కలిసి స్టోరీ డిస్కస్ చేసినట్లు ఫిలిం నగర్ టాక్. కొరటాల 'దేవర 2 ' బన్నీ త్రివిక్రమ్ మూవీ ఫినిష్ చేసాక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోందని సమాచారం.