ENGLISH

పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట

02 January 2025-14:18 PM

పుష్ప 2 ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు సంధ్య థియేటర్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. బన్నీ రాకతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించింది. కొడుకు శ్రీ తేజ్ చావు బతుకుల్లో హాస్పటల్లో ఉన్నాడు. ఈ ఘటన పై వెంటనే స్పందించిన పోలీసులు హీరో అల్లు అర్జున్ తో పాటు చిత్ర నిర్మాతలు, మైత్రీ మూవీస్ అధినేతలు ఎలమంచిలి రవి శంకర్, నవీన్ యెర్నేనిపై కూడా కేసు ఫైల్ చేసారు.  A11 గా అల్లు అర్జున్ పేరు నమోదు చేసి అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ రిలీజ్ చేయటంతో మరసటి రోజు రిలీజ్ అయ్యాడు బన్నీ.

ఇదే ఘటనలో నిందితులుగా ఉన్న పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ఎలమంచిలి రవి శంకర్, నవీన్ యెర్నేనిలు తమపై ఫైల్ చేసిన కేసు కొట్టి వేయాలని హైకోర్టులో పిటిషన్ వేసారు. థియేటర్ భద్రతతో తమకి సంబంధం లేదని, అది తమ పరిధి కాదని, అయిన తాము ముందే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని, అందుకే అంత మంది పోలీసులు అక్కడ ఉన్నారని, తెలిపారు. అయినా అనుకోని సంఘటన వలన నష్టం జరిగిందని, అయితే ఈ ఘటనకు సినిమా ప్రొడ్యూసర్లని నిందితులుగా చేర్చటం కరక్ట్ కాదని వారి తరపు లాయరు వాదించారు.

ఇరువైపు వాదనలు విన్న కోర్టు పుష్ప 2 ప్రొడ్యూసర్స్ కు ఊరట నిచ్చింది. పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్లను అరెస్ట్ చేయోద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ పిటీషన్ వేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నెక్స్ట్ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

ALSO READ: అల్లు అర్జున్ - కొరటాల కాంబో రెడీ?