ENGLISH

బాలయ్య దబిడి దిబిడి ని ఆడేసుకుంటున్ననెటిజన్స్

03 January 2025-11:54 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజు' మూవీతో సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశీ రౌటేలా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతలో వేసుకున్న బాబీ, డాకు మహారాజ్ తో ఏదో ప్రయోగం చేస్తాడు అనుకున్నారు అంతా. టైటిల్ కూడా అలాగే డిఫరెంట్ గా ఉంది. ఇప్పటివరకు ఇచ్చిన అప్డేట్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. టీజర్, గ్లింప్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. కానీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 'దబిడి దిబిడి' పాటతో టీమ్ మొత్తం ట్రోల్స్ కి గురి అవుతున్నారు.

బాలయ్యకి ట్రోల్స్ కొత్త కాదు అని అనుకోవచ్చు కానీ ఈ మధ్య బాలయ్య తీరు మారింది. హ్యాట్రిక్  హిట్స్, అన్స్టాపబుల్ షోతో పాన్ ఇండియా గుర్తింపు వచ్చాయి. అన్స్టాపబుల్ షో కేవలం బాలయ్య మాటలు కోసం చూసే వారున్నారంటే అతిశయం కాదు. ఇలాంటి  టైం లో డాకు మహారాజు మూవీ నుంచి 'దబిడి దిబిడి' అనే పాట రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ లో బాలయ్యతో కలిసి ఊర్వశీ రౌటేలా చిందేసింది. కానీ ఈ పాట ఏమాత్రం ఆకట్టుకో పోగా ట్రోల్స్ కి గురి అవుతోంది. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై కూడా విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. బాబీ మేకింగ్ కి ఈ పాటకి ఏమాత్రం పొంతన లేదని విమర్శలు చేస్తున్నారు. బాలయ్య ఏజ్ కి ఊర్వశి తో వేసిన స్టెప్స్ అసభ్యంగా ఉన్నాయని పలువురు ట్రోల్స్ చేస్తున్నారు.

చివరికి బాలయ్య ఫాన్స్ కి కూడా ఈ పాట నచ్చటం లేదు. దీనితో ఓపెన్ గా ఫాన్స్ అయిన మాకే నచ్చడం లేదు మిగతా వాళ్లకి ఎందుకు నచ్చుతుంది అని ఫైర్ అవుతున్నారు. పాట కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ ని ఈ స్టెప్పులు ఏంటి  నాయనా? అని డైరక్ట్ గా కామెంట్స్ పెడుతున్నారు. బాబీ పై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. బాబీ ఎందుకు రొటీన్ గా మాస్ మసాలా సాంగ్ పెట్టాడని తిట్టిపోస్తున్నారు.