ENGLISH

Krishna Vamsi: కృష్ణ‌వంశీతో అంత రిస్క్ ఎవ‌రు తీసుకుంటారు?

03 July 2022-15:07 PM

క్రియేటీవ్ డైరెక్ట‌ర్ గా కృష్ణ‌వంశీకి మంచి పేరుంది. కాక‌పోతే ఆయ‌న క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ కాదు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలు హిట్ట‌య్యాయి.కానీ... భారీ వ‌సూళ్ల‌ని అందుకోలేక‌పోయాయి. కృష్ణ‌వంశీతో రూ.10 కోట్ల సినిమా అంటేనే నిర్మాత‌లు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అలాంటిది కృష్ణ‌వంశీతో రూ.300 కోట్ల ప్రాజెక్టు ఎవ‌రు చేస్తారు?

 

కృష్ణ‌వంశీ ద‌గ్గ‌ర ఓటీటీ సిరీస్ కి సంబంధిచిన క‌థ ఉంద‌ట‌. దాని బ‌డ్జెట్ రూ.200 నుంచి రూ.300 కోట్లని టాక్‌. ఈ విష‌యం కూడా ఆయ‌నే చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించాల‌ని కృష్ణ వంశీ స్కెచ్ వేస్తున్నారు. రూ.300 కోట్ల‌తో ఓ ప్రాజెక్టు, అందులోనూ ఓటీటీ కోసం, పైగా కృష్ణ‌వంశీ ద‌ర్శ‌కుడు అంటే ఎంత రిస్కో అర్థం చేసుకోవొచ్చు.

 

కృష్ణ‌వంశీ క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టి కొన్నేళ్ల‌యిపోయింది. ఆయ‌న రెండేళ్లుగా తెర‌కెక్కిస్తున్న రంగ‌మార్తండ ఎప్పుడు పూర్త‌వుతుందో తెలీదు. పైగా ఇంత చిన్న బ‌డ్జెట్ సినిమానే, ముక్కుతూ మూలుగుతూ షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ నేప‌థ్యంలో కృష్ణ‌వంశీ పెద్ద క‌ల‌లు క‌న‌డం, రూ.300 కోట్ల ప్రాజెక్టు గురించి మాట్లాడ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశమే.

ALSO READ: లైగర్ బోల్డ్ పిక్.. అసలు విషయం ఇదే..!!