ENGLISH

Pakka Commercial: క‌మ‌ర్షియ‌ల్ ఫ్లాపులో.. ప్ర‌భాస్ వాటా

04 July 2022-10:00 AM

గోపీచంద్ - మారుతి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పక్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా... బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తా కొట్టిన సంగ‌తి తెలిసిందే. క‌మ‌ర్షియ‌ల్ హంగులు ఎక్కువై, క‌థ ట్రాక్ త‌ప్పడం వ‌ల్ల జ‌రిగిన పరిణామం ఇది. బ‌న్నీ వాస్ ఈ సినిమాపై భారీగా ఖ‌ర్చు పెట్టారు. ప్ర‌మోష‌న్లు కూడా బాగానే చేశారు. కానీ ఫ‌లితం క‌నిపించ‌లేదు. నిజానికి గోపీచంద్ తో ఓ సినిమా చేయాల‌ని... మారుతికి లేద‌ట‌. ఆయ‌న వేరే వేరే హీరోల్ని వెదికి ప‌ట్టుకొనే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఈ సినిమా సెట్ అవ్వ‌డానికి తెర వెనుక ప్ర‌ధాన సూత్ర‌ధారి ప్ర‌భాస్ అని తేలింది.

 

ఓసారి మారుతిని పిలిచి మాట్లాడిన ప్ర‌భాస్ `గోపీచంద్ కోసం ఓ మంచి క‌థ రెడీ చేయొచ్చు క‌దా` అని అడిగాడ‌ట‌. ప్ర‌భాస్ - గోపీచంద్ మంచి స్నేహితుల‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ అడిగేస‌రికి.. మారుతి కాదంటాడా? ర‌వితేజ కోసం సిద్ధంగా ఉంచుకొన్న‌... ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌నే గోపీచంద్ కి వినిపించాడు. మారుతిపై న‌మ్మ‌కంతో గోపీచంద్ ఈ క‌థ‌ని ఓకే చేశాడు. తాను చెప్ప‌గానే గోపీచంద్ కోసం క‌థ రెడీ చేసి, సినిమా చేస్తున్నాడ‌న్న ఫీలింగ్ తో.. ప్ర‌భాస్ కూడా మారుతికి డేట్లు ఇచ్చాడు. అలా.. గోపీచంద్ సినిమా వ‌ల్ల‌.. ప్ర‌భాస్ సినిమాని ప‌ట్టుకోగ‌లిగాడు మారుతి.

 

కాక‌పోతే.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఇప్పుడు ఫ్లాప్ అయ్యింది. అలా ఈ ఫ్లాపులో.. ప్ర‌భాస్ కూడా వాటా ద‌క్కించుకొన్న‌ట్టైంది.

ALSO READ: కృష్ణ‌వంశీతో అంత రిస్క్ ఎవ‌రు తీసుకుంటారు?