ENGLISH

Krithi Shetty: మ‌హేష్‌, చ‌ర‌ణ్‌ల‌పై క‌న్నేసిన గ్లామ‌ర్ క్వీన్‌

06 July 2022-14:08 PM

కృతి శెట్టి.. ఎక్క‌డ చూసినా ఈ పేరే మార్మోగిపోతోంది. ఇప్పుడు త‌న చేతిలో ఆరు సినిమాలున్నాయి. అందులో ఓ త‌మిళ సినిమా కూడా ఉంది. త‌మిళంలో సూర్య స‌ర‌స‌న న‌టిస్తోంది కృతి. ప్ర‌స్తుం రామ్ తో `ది వారియ‌ర్` అనే సినిమాలో న‌టించింది. ఇందులో ఆర్జేగా క‌నిపించ‌నుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కానుంది. మీరు ఎవ‌రి సినిమాల్లో న‌టించాల‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు? అని అడిగితే, ఇద్ద‌రి పేర్లు ట‌క ట‌క చెప్పేసింది. వాళ్లే మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌. వీరిద్ద‌రినీ ఆకాశానికి ఎత్తేస్తోంది కృతి.

 

``చ‌ర‌ణ్ సూప‌ర్ క్యూట్ గా ఉంటారు. మ‌హేష్ హ్యాండ్స‌మ్ హీరో. ఇద్ద‌రూ సినిమా నేప‌థ్యం నుంచే వ‌చ్చారు. వాళ్లింట్లో స్టార్లు ఉన్నారు. వీళ్లూ పెద్ద స్టార్లుగా మారారు.

 

అయితే చాలా సింపుల్ గా కనిపిస్తారు. వాళ్ల‌తో న‌టించే అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నా`` అని త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టేసింది. రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ చేతిల్లో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. వాళ్లు `ఓకే` అంటే చాలు. నెక్ట్స్ సినిమాలో కృతికి అవ‌కాశం వ‌చ్చేస్తుంది. ఆ అదృష్ట ఘ‌డియ‌ల కోస‌మే.. కృతి కూడా ఆస‌క్తిగా ఎద‌రు చూస్తోందేమో..?

ALSO READ: F3: 'ఎఫ్ 3' లెక్క 134 కోట్లు