ENGLISH

Pakka Commercial: పక్కాగా గ‌ట్టెక్కించింది అదే..!

06 July 2022-11:00 AM

గోపీచంద్ - మారుతి కాంబినేష‌న్ లో విడుద‌లైన సినిమా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`. గీతా ఆర్ట్స్ 2 సంస్థ భారీ వ్య‌య ప్ర‌యాస‌ల‌తో ఈచిత్రాన్ని తెర‌కెక్కించింది. అయితే... విడుద‌ల రోజునే ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వ‌చ్చేసింది. ఫ‌స్ట్ షోకి.. వ‌సేళ్లు డౌన్ అయిపోయాయి. సోమ‌వారానికి థియేట‌ర్లు ఖాళీ. ఈ సినిమాకి థియేట‌ర్ నుంచి క‌నీసం రూ.5 కోట్లు కూడా రావ‌ని టాక్‌. ఈ సినిమాకి దాదాపు రూ.35 కోట్ల బ‌డ్జెట్ అయ్యింది. ప‌బ్లిసిటీకి మ‌రో రూ2 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. అంటే రూ.37 కోట్ల‌న్న‌మాట‌. అయితే అదృష్టం కొద్దీ గోపీచంద్ కి హిందీ శాటిలైట్ మార్కెట్ బాగుంది. డిజిటల్‌, ఓటీటీ, శాటిలైట్ నుంచి దాదాపు రూ.30 కోట్లు వ‌చ్చాయి. నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ వ‌ల్ల‌.. ఈ సినిమా గ‌ట్టెక్కింది. లేదంటే నిర్మాత బ‌న్నీ వాస్ ఈపాటికి మునిగిపోయేవాడే.

 

సినిమా విడుద‌ల‌కు ముందే.. నాన్‌థియేట‌రిక‌ల్ రైట్స్ అన్నీ అమ్మేడం మంచిది అయ్యింది. పైగా మారుతి గ‌త చిత్రాలు భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు, ప్ర‌తి రోజూ పండ‌గేల‌కు ఇప్ప‌టికీ మంచి రేటింగులు వ‌స్తుంటాయి. కాబ‌ట్టి... ఈ సినిమానీ శాటిలైట్ సంస్థ‌లు పోటీ ప‌డి కొన్నాయి.

ALSO READ: 'పుష్ప 2' లో కీల‌క‌మైన మార్పు.. ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే