ENGLISH

Gowtham Raju: షాక్: ఎడిటర్‌ గౌతమ్‌ రాజు ఇకలేరు

06 July 2022-10:29 AM

ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

 

ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. చట్టానికి కళ్లులేవు’ సినిమా గౌతమ్‌రాజు ఎడిటర్‌గా మొదటి సినిమా. తర్వాత నెంబర్ వన్ ఎడిటర్స్ లో ఒకరిగా కొనసాగిన ఆయన దాదాపు వెయ్యి చిత్రాలకు ఎడిటర్ గా పని చేశారు.

 

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ఇలా దాదాపు హీరోలందరి సినిమాలకు ఆయన పని చేశారు. గౌతమ్‌ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్‌రాజు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ALSO READ: 'ఎఫ్ 3' లెక్క 134 కోట్లు