ENGLISH

అనుమానాస్పద స్థితిలో నటి మృతి

13 June 2017-12:38 PM

నటి, మోడల్అయిన కృతికా చౌదరి (30) ముంబైలోని తను ఉంటున్న ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

వివరాల్లోకి వెళితే, ముంబైలో గల వెస్ట్ అంధేరీ ప్రాంతంలోని బైరవనాథ్ సొసైటీ లో ఆమె కొంతకాలంగా నివసిస్తున్నది. అయితే ఆమె గత నాలుగు రోజుల నుండి ఇంటి వెలుపలికి రాలేదని అలాగే తను ఉంటున్న ఇంటి నుండి కూడా దుర్వాసన వస్తుండడంతో ఆ సొసైటీ వారు పోలీసులకి సమాచారం అందించారు.

ఆ వెంటనే పోలీసులు వచ్చి ఇంటి తలుపు పగలగొట్టడంతో ఆమె అప్పటికే మృతి చెంది రెండు రోజులు దాటినట్టు నిర్దారణకు వచ్చారు. అయితే ప్రాధమిక సమాచారం బట్టి ఆమెని ఎవరో హత్య చేసి ఉండొచ్చు అని భావిస్తున్నారు.

మిగిలిన వివరాలు గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలుపెట్టారు. ఇక కృతిక పలు హిందీ సీరియల్స్ తో పాటు కంగనా రనౌత్ నటించిన రాజ్జో చిత్రంలో ఒక పాత్ర చేసింది.

ALSO READ: తెలంగాణ అసెంబ్లీలో మహేష్?!