ENGLISH

లాస్య క్లారిటీకి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే..

17 November 2020-16:00 PM

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌లో యాంకర్‌గా పనిచేసిన లాస్య అనగానే ‘చీమ జోకు’ గుర్తుకొస్తుంటుంది. ఇప్పుడామె ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో ‘పెద్దక్క’ చాలామందికి. చాలా డిగ్నిటీతో వ్యవహరిస్తోంది బిగ్‌ హౌస్‌లో లాస్య. టాప్‌ 5లో ఆమెకు ఖచ్చితంగా చోటు దక్కుతుందనే అభిప్రాయం బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌లో కనిపిస్తోంది. చిన్న చిన్న విషయాల్లో తప్పితే, లాస్యను నామినేట్‌ చేయడానికి పెద్ద కారణాలు హౌస్‌మేట్స్‌లో ఎవరికీ కనిపించడంలేదు.

 

అయితే, గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియ కోసం తమ సహచర కంటెస్టెంట్స్‌ని నామినేట్‌ చేయడానికి సరైన రీజన్స్‌ని వెతుక్కోలేకపోతున్నారు. ఒకరిద్దరు మినహాయిస్తే, దాదాపుగా అందరిదీ ఇదే పరిస్థితి. మరీ ముఖ్యంగా లాస్యని నామినేట్‌ చేయడానికి సరైన కారణాలే దొరకట్లేదు కంటెస్టెంట్స్‌కి. అలా చూస్తే, లాస్య బిగ్‌హౌస్‌లో వన్‌ ఆఫ్‌ ది స్ట్రాంగెస్ట్‌ కంటెస్టెంట్స్‌ అని చెప్పక తప్పదు. ‘లాస్యలో ఇంత మంచి డాన్సర్‌ వుందా.?’ అని ఆశ్చర్యమేసేలా ఆమె డాన్సులు చేస్తోంది. దాదాపుగా లాస్య ఇంతవరకు ఏ రోజు కూడా బద్దకంగా కనిపించలేదు హౌస్‌లో.

 

ఫుల్‌ ఎనర్జీతో కనిపించే లాస్య, ఈ సీజన్‌లో ముందు ముందు ఇంకెంతగా ఆకట్టుకుంటుందోగానీ.. టైటిల్‌ విన్నర్‌ అయ్యేందుకు అవసరమైన క్వాలిటీస్‌లో ఆమెలో వున్నాయని మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. అబిజీత్‌ గ్రూప్‌లో పడేసి, ఆమెను నామినేట్‌ చేయడానికి కారణాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి అఖిల్‌ గ్రూప్‌కి వచ్చింది. ఇదొక్కటే ఆమెకు కాస్తో కూస్తో సమస్య.. అనుకోవాలేమో.

ALSO READ: చిరు తీరుపై చెల‌రేగుతున్న‌ విమ‌ర్శ‌లు.