ENGLISH

మూగబోయిన గానకోకిల.. లతాజీ ఇక లేరు

06 February 2022-10:30 AM

లెజండరీ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ ‌ ఆదివారం ఉదయం కన్నుమూశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆదివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు.

 

30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో వేల గీతాలను ఆలపించారు. దేశంలోని దాదాపు అన్ని భాషలలోనూ ఆమె పాడారు. భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలకు గానూ తొలిసారి 1969లో పద్మ భూషణ్‌ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందించింది. ఆ తర్వాత 1999లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 2001 భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను అందుకున్నారు. లతా మంగేష్కర్ మరణంతో సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసినట్లయింది.

ALSO READ: అడ‌విలో ఎన్టీఆర్ ఏం చేస్తాడు?